Telugu Global
National

ప్రధాని గారూ.... ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీకి రండి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడారు. ఉగాది నాటికి రాష్ట్రంలోని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించి అందుకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధానిని ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆకాంక్షను సీఎం వ్యక్తం చేశారు. మరిన్ని కీలకమైన అంశాలను ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లినట్టు […]

ప్రధాని గారూ.... ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీకి రండి!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడారు. ఉగాది నాటికి రాష్ట్రంలోని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించి అందుకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధానిని ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆకాంక్షను సీఎం వ్యక్తం చేశారు.

మరిన్ని కీలకమైన అంశాలను ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. 2021లోపు పోలవరం పూర్తికి సహకరించాలని కోరారు. 55 వేల 549 కోట్ల రూపాయలకు పెరిగిన అంచనా మొత్తాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న 3,320 కోట్ల రూపాయల విడుదలకు ఆదేశించాలన్నారు. అలాగే.. 15వ ఆర్థిక సంఘం చెప్పిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం కేంద్రానికి ఉందని జగన్ చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకుని హోదా కల్పించాలని మరోసారి ప్రధానిని కోరారు.

18,969 కోట్ల రూపాయల రెవెన్యూ లోటును కేంద్రం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులు తగ్గిపోయాయని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. నిధులు పెంచాలన్నారు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలుకు హై కోర్టు తరలింపు నిర్ణయానికి సహకరించేలా.. కేంద్ర న్యాయ శాఖకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.

3 రాజధానుల నిర్ణయం.. పరిపాలన వికేంద్రీకరణ ప్రధానోద్దేశాలు ప్రధానికి వివరించిన ముఖ్యమంత్రి.. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అలాగే.. శాసనమండలి రద్దుకు దారి తీసిన పరిస్థితులు వివరించారు. త్వరగా ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. దిశ చట్టాన్ని వివరించి.. అమలు తీరును ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ చట్టాన్ని కూడా కేంద్రం ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  13 Feb 2020 3:44 AM IST
Next Story