వన్డే ర్యాంకింగ్స్ లో కొహ్లీ అప్, బుమ్రా డౌన్
కివీస్ తో సిరీస్ ఓడినా టాప్ ర్యాంక్ నిలుపుకొన్న విరాట్ న్యూజిలాండ్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో భారత్ చిత్తుగా ఓడినా…కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం తన టాప్ ర్యాంక్ ను నిలుపుకొన్నాడు. అయితే …భారత నంబర్ వన్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మాత్రం ర్యాంకింగ్స్ లో మరింత దిగజారాడు. ఐసీసీ తాజాగా వెలువరించిన వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం…బ్యాట్స్ మన్ గా విరాట్ కొహ్లీ టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తో […]
- కివీస్ తో సిరీస్ ఓడినా టాప్ ర్యాంక్ నిలుపుకొన్న విరాట్
న్యూజిలాండ్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో భారత్ చిత్తుగా ఓడినా…కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం తన టాప్ ర్యాంక్ ను నిలుపుకొన్నాడు. అయితే …భారత నంబర్ వన్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మాత్రం ర్యాంకింగ్స్ లో మరింత దిగజారాడు.
ఐసీసీ తాజాగా వెలువరించిన వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం…బ్యాట్స్ మన్ గా విరాట్ కొహ్లీ టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల్లో కలసి 75 పరుగులు మాత్రమే సాధించిన విరాట్ నంబర్ వన్ ర్యాంకులో నిలిస్తే…భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండు, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రోజ్ టేలర్ నాలుగు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇప్పటి వరకూ నంబర్ వన్ స్థానంలో ఉన్న బుమ్రా…కివీస్ తో సిరీస్ లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. 30 ఓవర్లలో బుమ్రా 167 పరుగులివ్వడం ద్వారా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో నంబర్ వన్ ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్ కు పడిపోయాడు.
మరోవైపు కీవీ స్వింగ్ బౌలర్ ట్రెంట్ బౌలర్ వన్డే క్రికెట్లో నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.
7వ ర్యాంక్ లో జడేజా…
ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా మూడుస్థానాల మేర తన ర్యాంకును మెరుగుపరచుకొని 7వ ర్యాంక్ లో నిలిచాడు. అఫ్ఘన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ, ఇంగ్లండ్ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మొదటి రెండుర్యాంకుల్లో కొనసాగుతున్నారు.