Telugu Global
NEWS

విశాఖను రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారో చెప్పిన జగన్

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ టీడీపీ నేతలు ఓ వైపు ప్రయత్నిస్తుంటే.. అధికార వైసీపీ నేతలు తమ వాదన వినిపిస్తూ పోటీగా జనంలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో.. 3 రాజధానులను ఎంపిక చేయడానికి గల కారణాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి జగన్.. సీన్ లోకి నేరుగా ఎంటర్ అయ్యారు. తన వాదన వినిపించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ…. విశాఖనే కార్యనిర్వాహక రాజధానిగా ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందన్న కారణాన్ని లాజికల్ గా వివరించారు. […]

విశాఖను రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారో చెప్పిన జగన్
X

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ టీడీపీ నేతలు ఓ వైపు ప్రయత్నిస్తుంటే.. అధికార వైసీపీ నేతలు తమ వాదన వినిపిస్తూ పోటీగా జనంలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో.. 3 రాజధానులను ఎంపిక చేయడానికి గల కారణాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి జగన్.. సీన్ లోకి నేరుగా ఎంటర్ అయ్యారు. తన వాదన వినిపించారు.

జాతీయ మీడియాతో మాట్లాడుతూ…. విశాఖనే కార్యనిర్వాహక రాజధానిగా ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందన్న కారణాన్ని లాజికల్ గా వివరించారు. అమరావతి ఇంకా గ్రామమే.. రాజధానిగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ స్థాయికి చేరాలంటే.. దశాబ్దాల కాలం పడుతుంది.. అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అదే.. విశాఖ అయితే ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరమని.. కాస్త పెట్టుబడులతో విశాఖను హైదరాబాద్ స్థాయికి చేర్చవచ్చని స్పష్టం చేశారు.

ఈ వాదనతో… జనాలు కూడా కన్విన్స్ అవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న తరుణంలో.. ప్రజల ద్వారా సమకూరిన ఆదాయాన్ని వృథా చేయకుండా.. మంచి ఆలోచన చేస్తే స్వాగతిస్తామని ప్రజలు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మరో విశేషం ఏంటంటే.. టీడీపీ నాయకులు ఇప్పటివరకూ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించకపోవడం.

అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే… ఇంతటి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు కదా.. మరి సీఎం జగన్ అమరావతిని ఇంకా గ్రామమే అని అంటుంటే ఎవరూ స్పందించకపోవడం ఏంటన్న చర్చ కాస్త జోరుగానే జరుగుతోంది.

First Published:  12 Feb 2020 2:35 AM IST
Next Story