Telugu Global
NEWS

కేసీఆర్ కు ఝలక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేసీఆర్ కాలం నడుస్తోంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. రాజకీయంగా అది అమల్లోకి వచ్చేస్తోంది. అలాంటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను.. కాస్త గట్టిగా ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీనే ఎక్కువగా ప్రయత్నం చేస్తోంది. అది కూడా.. నిజామాబాద్ కేంద్రంగా… తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్.. ఈ బాధ్యతను భుజాన వేసుకున్నట్టే కనిపిస్తోంది. […]

కేసీఆర్ కు ఝలక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట!
X

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేసీఆర్ కాలం నడుస్తోంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. రాజకీయంగా అది అమల్లోకి వచ్చేస్తోంది. అలాంటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను.. కాస్త గట్టిగా ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీనే ఎక్కువగా ప్రయత్నం చేస్తోంది. అది కూడా.. నిజామాబాద్ కేంద్రంగా… తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్.. ఈ బాధ్యతను భుజాన వేసుకున్నట్టే కనిపిస్తోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కీలక నేతగా ఉండి.. శాసనసభ స్పీకర్ గా సమర్థంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందిన నాయకుడు సురేష్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ కు రోజులు బాగాలేకపోవడంతో అధికార టీఆర్ఎస్ లో చేరారు. నాటి నుంచి నేటి వరకు ఏ పదవి లేకుండా కామ్ గానే ఉన్నారు. తన జిల్లాకే చెందిన సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కు ఆయన కాంగ్రెస్ లో ఉన్న రోజుల్లో సన్నిహితుడిగా మెలిగినట్టు వార్తలున్నాయి. ఇప్పుడు అదే ధర్మపురి శ్రీనివాస్ తనయుడు అరవింద్ నిజామాబాద్ ఎంపీగా బీజేపీ నుంచి గెలిచారు.

నిజామాబాద్ తో పాటుగా రాష్ట్రంలోనూ పార్టీకి పునాదులు బలంగా చేసే బాధ్యతను అరవింద్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన.. దగ్గరుండి మరీ సురేష్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిట్టుగా సమాచారం అందుతోంది. అయితే.. వచ్చే రెండు మూడు నెలలు చూసి కేసీఆర్ తనకు నిజంగానే ఏ పదవీ ఇవ్వకపోతే.. పార్టీ మారేందుకు ఆయన కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో మరింత మంది నేతలు ఉండే ఉంటారని.. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా.. మౌనాన్ని కొనసాగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఇలా.. సురేష్ రెడ్డిని లాగి.. కేసీఆర్ కే ఝలక్ ఇవ్వాలని అరవింద్ ప్రయత్నం చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజమెంత? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

First Published:  12 Feb 2020 3:04 AM IST
Next Story