Telugu Global
National

ప్రాంతీయ పార్టీలు.... బీజేపీని బాగానే దెబ్బకొడుతున్నాయి..!

బీజేపీకి కాలం కలసి రావడం లేదు. అంచనాలు గల్లంతై.. ఆశించిన ఫలితాలనూ ఆ పార్టీ అందుకోలేక పోతోంది. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల విషయంలో ఈ విషయం నిరూపితమైంది. దక్షిణాన కర్ణాటకను మినహాయిస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ హవాను ప్రాంతీయ పార్టీలు ఎలా అడ్డుకున్నాయన్నది అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే.. ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. 2014లో 5 స్థానాలలో బీజేపీ గెలిస్తే.. 2018 నాటి ఎన్నికలకు వచ్చేసరికి కేవలం ఒక స్థానంలో […]

ప్రాంతీయ పార్టీలు.... బీజేపీని బాగానే దెబ్బకొడుతున్నాయి..!
X

బీజేపీకి కాలం కలసి రావడం లేదు. అంచనాలు గల్లంతై.. ఆశించిన ఫలితాలనూ ఆ పార్టీ అందుకోలేక పోతోంది. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల విషయంలో ఈ విషయం నిరూపితమైంది. దక్షిణాన కర్ణాటకను మినహాయిస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ హవాను ప్రాంతీయ పార్టీలు ఎలా అడ్డుకున్నాయన్నది అర్థం చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే.. ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. 2014లో 5 స్థానాలలో బీజేపీ గెలిస్తే.. 2018 నాటి ఎన్నికలకు వచ్చేసరికి కేవలం ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది. సభలో దాదాపుగా ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది.

ఇక.. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే… ఖాతా కూడా తెరవలేక చతికిలబడింది. 2019 ఎన్నికల్లో వైసీపీ హవా ముందు టీడీపీ కూడ ప్రభావం చూపలేక చేతులెత్తేసింది. తాజాగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభంజనం సృష్టించింది.

త్వరలో బీహార్, బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ లో నితీశ్ ను, బెంగాల్ లో మమతను కాదని బీజేపీ నాయకులు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఈ లెక్కన.. ఆయా రాష్ట్రాల్లోనూ చాలా కష్టంగానే రాజకీయం చేయాల్సి ఉంటుంది. లేదంటే.. అఖండ భారతాన్ని పరిపాలించాలని వారు కన్న కలలకు ఆదిలోనే హంసపాదు లాంటి ఫలితాలు ఎదురైనట్టే లెక్క.

ఇంతటి పరిస్థితిని కల్పించిన దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వారిలో ఏమైనా మార్పును తెస్తాయో లేదో చూడాలి.

First Published:  11 Feb 2020 9:59 PM GMT
Next Story