11 జాతీయ సంస్థలతో ఒప్పందాలు... సాగుకు రాచమార్గాలు
వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది. సాగుకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది.. సాగును బాగు చేసింది. ఆ ఒరవడిని అనేక రాష్ట్రాలు అంది పుచ్చుకుని.. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్న పేరును సార్థకం చేసేలా కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటికే రకరకాల సంక్షేమ కార్యక్రమాలతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న జగన్ […]
వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది. సాగుకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది.. సాగును బాగు చేసింది. ఆ ఒరవడిని అనేక రాష్ట్రాలు అంది పుచ్చుకుని.. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్న పేరును సార్థకం చేసేలా కార్యాచరణ అమలు చేస్తోంది.
ఇప్పటికే రకరకాల సంక్షేమ కార్యక్రమాలతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వం.. తాజాగా జాతీయ స్థాయిలో ప్రముఖమైన 11 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వ్యవసాయ, పశు సంవర్థక శాఖ అధికారులు సీఎం సమక్షంలో సంతకాలు చేశారు. వీటి ప్రకారం.. రాష్ట్ర రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సహకారం అందనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏ కాలానికి ఏ పంట వేయాలి.. ఎలాంటి ఎరువులు వాడాలి అన్నది తెలియజేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో చెన్నైకి చెందిన స్వామినాథన్ ఫౌండేషన్.. ఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్, సాయిల్ సైన్స్ డివిజన్, హైదరాబాద్ కు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్, సెంట్రల్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ డ్రై లాండ్ అగ్రికల్చర్… కర్నాల్ లోని నేషనల్ డెయిరీ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్, ఇండియన్ వెటర్నరీ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్.. ఫరీదాబాద్ సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ – శిక్షణ సంస్థ, వారణాసి నేషనల్ సీడ్ రిసర్చ్ – శిక్షణ సంస్థ, బెంగళూరుకు చెందిన సదరన్ రీజనల్ యానిమల్ డిసీజ్ డయాగ్నొస్టిక్ లాబ్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, ఐసీఏఆర్-సీఐఎఫ్ఏ వంటి సంస్థలు ఉన్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా త్వరలో 11 వేల 158 రైతు భరోసా కేంద్రాలు రాబోతున్నట్టు చెప్పారు. జూన్ నాటికి దాదాపుగా వీటిని సిద్ధం చేస్తామని.. వీటిలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, ఆక్వా సహాయకులు అందుబాటులో ఉండి.. ఆయా రంగాలపై ఆధారపడిన వారికి సరైన దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల సహకారంతో.. రైతులకు, అనుబంధ రంగాలకు తగిన విజ్ఞానాన్ని అందించనున్నట్టు చెప్పారు.
రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతామని.. వీటికి ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుందని తెలిపారు. సేంద్రీయ విధానాలపైనా రైతులకు తగిన విధంగా శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో.. రైతులకు మరింతగా ప్రభుత్వాన్ని చేరువ చేయనున్నారు.