Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లో పాక్ పేసర్ హ్యాట్రిక్ రికార్డు

16 ఏళ్ల వయసులోనే నసీమ్ షా హ్యాట్రిక్ అలోక్ కపాలీ రికార్డు తెరమరుగు సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు నమోదయ్యింది. అతిచిన్నవయసులోనే హ్యాట్రిక్ నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్ గా పాక్ టీనేజ్ సంచలనం నసీమ్ షా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 16 సంవత్సరాల నసీమ్ షా వరుస బంతుల్లో మూడు వికెట్లు […]

టెస్ట్ క్రికెట్లో పాక్ పేసర్ హ్యాట్రిక్ రికార్డు
X
  • 16 ఏళ్ల వయసులోనే నసీమ్ షా హ్యాట్రిక్
  • అలోక్ కపాలీ రికార్డు తెరమరుగు

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు నమోదయ్యింది. అతిచిన్నవయసులోనే హ్యాట్రిక్ నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్ గా పాక్ టీనేజ్ సంచలనం నసీమ్ షా రికార్డు నెలకొల్పాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 16 సంవత్సరాల నసీమ్ షా వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి…తన కెరియర్ లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు.

గంటకు 150 కిలోమీటర్ల మెరుపువేగంతో బౌల్ చేసే నసీమ్ షా…బంగ్లా మిడిలార్డర్ ఆటగాళ్లు నజ్మల్ హుస్సేన్, తైజుల్ ఇస్లాం, మహ్మదుల్లాలను పెవీలియన్ దారి పట్టించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

వచ్చేనెలలో 17వ పుట్టినరోజు జరుపుకోనున్న నసీమ్ షా…గత ఏడాది ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా టెస్టు అరంగేట్రం చేశాడు. గతంలో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ అలోక్ కపాలీ 19సంవత్సరాల వయసులో పాక్ ప్రత్యర్థిగా 2003లో జరిగిన పెషావర్ టెస్టు లో హ్యాట్రిక్ నమోదు చేయడం ద్వారా అత్యంత పిన్నవయస్కుడైన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. అ రికార్డును నసీమ్ షా ఇప్పుడు తిరగరాశాడు.

పాక్ బౌలర్లలో వసీం అక్రం రెండుసార్లు, అబ్దుల్ రజాక్, మహ్మద్ సమీ చెరోసారి…టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ లు సాధించిన బౌలర్లుగా ఉన్నారు.

First Published:  11 Feb 2020 1:32 AM IST
Next Story