Telugu Global
National

ఏపీ తర్వాత కాంగ్రెస్ కు గట్టి షాకిచ్చింది ఢిల్లీనే...

కాంగ్రెస్ కు నిద్రలేని రాత్రిని గడిపేలా చేశాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ఎన్నికల తర్వాత అత్యంత ఘోరమైన పర్ ఫామెన్స్ కనబరించింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా కాంగ్రెస్ గెలువలేక ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థులందరూ ఘోరంగా ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ తరువాత కాంగ్రెస్ 0 సీట్లును సాధించిన ఏకైక రాష్ట్రం ఢిల్లీ కావడం గమనార్హం. ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ […]

ఏపీ తర్వాత కాంగ్రెస్ కు గట్టి షాకిచ్చింది ఢిల్లీనే...
X

కాంగ్రెస్ కు నిద్రలేని రాత్రిని గడిపేలా చేశాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ఎన్నికల తర్వాత అత్యంత ఘోరమైన పర్ ఫామెన్స్ కనబరించింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా కాంగ్రెస్ గెలువలేక ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థులందరూ ఘోరంగా ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ తరువాత కాంగ్రెస్ 0 సీట్లును సాధించిన ఏకైక రాష్ట్రం ఢిల్లీ కావడం గమనార్హం.

ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఆ సదురు మీడియా సంస్థలు, ఎగ్జిల్ పోల్స్ సంస్థలు కూడా తాజా ఫలితాలతో షాక్ కు గురయ్యాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పట్టును పూర్తిగా కోల్పోయినట్టైంది.

కాంగ్రెస్ నుంచి పోటీచేసిన హేమాహేమీ నాయకులైన ఆల్కా లాంబా, కృష్ణ తీరత్, పూనం ఆజాద్, రాజేష్ లిలోథియా వంటి సీనియర్ నాయకులు కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీని కృంగదీసింది. 2015లో ఆల్కా లాంబా ఆప్ టికెట్ పై గెలుపొందింది. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరి పోటీచేసింది. ఇప్పుడు ఆమె ఘోరంగా ఓడిపోవడానికి కాంగ్రెస్ టికెట్ కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం సోనియా గాంధీతో సహా చాలా మంది ముఖ్యనాయకులు ప్రచారం చేయకుండా దూరంగా ఉన్నారు. ప్రియాంకా గాంధీ కూడా నామమాత్రంగా తిరిగేశారు. కాంగ్రెస్ ను మూడు సార్లు ఢిల్లీలో గెలిపించిన షీలాదీక్షిత్ మరణించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రజాదరణ కోల్పోయింది. ఇప్పుడు గల్లంతైంది.

First Published:  11 Feb 2020 5:00 PM IST
Next Story