Telugu Global
Cinema & Entertainment

ఫేమస్ లవర్ కు 3 కత్తెర్లు

ట్రయిలర్ రిలీజ్ అయినప్పుడే చాలామంది ఈ సినిమాపై అనుమానాలు వ్యక్తంచేశారు. మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించారు. కానీ ఆశ్చర్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కేవలం 3 కట్స్ తో పాస్ అయింది. ఆ 3 కట్స్ కూడా సెన్సార్ సూచించినవి కావు. మేకర్సే సెన్సార్ కాపీతో మ్యూట్స్ వేసి ఇచ్చారు. దీంతో యు/ఏ సర్టిఫికేట్ తో సినిమా పాస్ అయింది. విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇక సినిమా రన్ […]

ఫేమస్ లవర్ కు 3 కత్తెర్లు
X

ట్రయిలర్ రిలీజ్ అయినప్పుడే చాలామంది ఈ సినిమాపై అనుమానాలు వ్యక్తంచేశారు. మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించారు. కానీ ఆశ్చర్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కేవలం 3 కట్స్ తో పాస్ అయింది. ఆ 3 కట్స్ కూడా సెన్సార్ సూచించినవి కావు. మేకర్సే సెన్సార్ కాపీతో మ్యూట్స్ వేసి ఇచ్చారు. దీంతో యు/ఏ సర్టిఫికేట్ తో సినిమా పాస్ అయింది. విడుదలకు లైన్ క్లియర్ అయింది.

ఇక సినిమా రన్ టైమ్ విషయానికొస్తే, ఈ మూవీ 2 గంటల 35 నిమిషాల నిడివి ఉంది. ఇది డీసెంట్ రన్ టైమ్. నిజానికి మరో 15 నిమిషాలు రన్ టైమ్ తగ్గిందామని అనుకున్నప్పటికీ.. లోతుగా చర్చించి 2 గంటల 35 నిమిషాలకే ఫిక్స్ అయ్యారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్, క్యాథరీన్, ఇజబెల్లా హీరోయిన్లుగా నటించారు.

సెన్సార్ టాక్ విషయానికొస్తే.. మూవీ స్టోరీలైన్ రెగ్యులర్ గానే ఉందట. కాకపోతే ట్రీట్ మెంట్ మాత్రం ఇప్పటితరానికి కనెక్ట్ అయ్యేలా ఉందంటున్నారు. దీనికితోడు విజయ్ దేవరకొండ మరోసారి తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అంతా అనుకుంటున్నట్టు ఇది హీరో లైఫ్ లో 4 దశల్లో వచ్చే ప్రేమకథ కాదంట. సినిమాలో ఓ చిన్న ట్విస్ట్ ప్రకారం.. ఈ ప్రేమకథలు నడుస్తాయట.

First Published:  10 Feb 2020 11:55 AM IST
Next Story