Telugu Global
NEWS

మహిళా టీ-20లో భారత్ మరో సంచలనం

షెఫాలీ మెరుపు బ్యాటింగ్ తో ఆస్ట్ర్రేలియాపై గెలుపు 2020 టీ-20 మహిళా ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో 3వ ర్యాంక్ భారత్ మరో సంచలన విజయం సాధించింది. మూడుదేశాల ఈటోర్నీ ప్రారంభమ్యాచ్ లో ఇంగ్లండ్ ను కంగుతినిపించిన భారత్…మూడోమ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాపై అనూహ్య విజయం నమోదు చేసింది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో భారత్ 7 వికెట్లతో కంగారూలను కంగుతినిపించింది. ఈ మ్యాచ్ […]

మహిళా టీ-20లో భారత్ మరో సంచలనం
X
  • షెఫాలీ మెరుపు బ్యాటింగ్ తో ఆస్ట్ర్రేలియాపై గెలుపు

2020 టీ-20 మహిళా ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో 3వ ర్యాంక్ భారత్ మరో సంచలన విజయం సాధించింది.

మూడుదేశాల ఈటోర్నీ ప్రారంభమ్యాచ్ లో ఇంగ్లండ్ ను కంగుతినిపించిన భారత్…మూడోమ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాపై అనూహ్య విజయం నమోదు చేసింది.

మెల్బోర్న్ వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో భారత్ 7 వికెట్లతో కంగారూలను కంగుతినిపించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్ర్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. గార్డ్నర్ 93 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత ఓపెనింగ్ బౌలర్ దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టింది.

షెఫాలీ మెరుపు బ్యాటింగ్…

సమాధానంగా 174 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు…ఓపెనర్లు షెఫాలీ వర్మ- స్మృతి మంథానా…మొదటి వికెట్ కు 85 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

స్మృతి 48 బాల్స్ లో 7 బౌండ్రీలతో 55 పరుగులు సాధించగా యువసంచలనం షెఫాలీ కేవలం 28 బాల్స్ లోనే ఓ సిక్సర్ , 8 బౌండ్రీలతో 49 పరుగుల స్కోరు సాధించింది. జెమీమా 30, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు సాధించడంతో భారత్ మరో 2 బాల్స్ మిగిలిఉండగానే 7 వికెట్ల విజయం సొంతం చేసుకోగలిగింది.

First Published:  10 Feb 2020 6:49 AM IST
Next Story