కియాపై లెంపలేసుకున్న రాయిటర్స్.... తప్పుడు ట్వీట్ తొలగింపు
తెలుగుదేశం ప్రచారం మొత్తం అబద్దం అని తేలిపోయింది. ఎల్లో మీడియాది విష ప్రచారమని మరోసారి తేటతెల్లమైంది. అక్కడ ఏం జరగలేదు. అసలు అలాంటి వార్తలే లేవు. కానీ రాయిటర్స్ నుంచి బీబీసీ తెలుగు వరకు ఉన్న ఎల్లో మీడియా ఏజెంట్ల సహకారంతో…. ఏపీ సర్కార్‌పై దుమ్మెత్తిపోయడమే వార్తల కవరేజీగా మారింది. ఇప్పుడు మరోసారి అదే నిజమైంది. మొన్నటికి మొన్న అమరావతిపై దప్రింట్ ఎడిటర్ శేఖర్‌గుప్తాతో ఓ వీడియో చేయించారు. ఆయనకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. దేనికి […]
తెలుగుదేశం ప్రచారం మొత్తం అబద్దం అని తేలిపోయింది. ఎల్లో మీడియాది విష ప్రచారమని మరోసారి తేటతెల్లమైంది. అక్కడ ఏం జరగలేదు. అసలు అలాంటి వార్తలే లేవు. కానీ రాయిటర్స్ నుంచి బీబీసీ తెలుగు వరకు ఉన్న ఎల్లో మీడియా ఏజెంట్ల సహకారంతో…. ఏపీ సర్కార్‌పై దుమ్మెత్తిపోయడమే వార్తల కవరేజీగా మారింది. ఇప్పుడు మరోసారి అదే నిజమైంది.
మొన్నటికి మొన్న అమరావతిపై దప్రింట్ ఎడిటర్ శేఖర్‌గుప్తాతో ఓ వీడియో చేయించారు. ఆయనకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. దేనికి ఆశపడి ఈ పని చేశాడో తెలియదు గానీ…. ఇన్నాళ్లు సంపాదించుకున్న క్రెడిబులిటిని మాత్రం పూర్తిగా పొగొట్టుకున్నాడు. ఇప్పుడు రాయిటర్స్‌ది కూడా అదే పరిస్థితి. అక్కడ పనిచేసేవారు కొందరి వల్ల ఇప్పుడు ఆ సంస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పుడు కియా మోటర్స్ విషయంలో లెంపలేసుకుంది.
కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతోందని రాయిటర్స్ ఓ వార్తను ట్వీట్ చేసింది. దీంతో ఎల్లో మీడియా నుంచి ఆ భజన బ్యాచ్, చంద్రబాబు…. మొత్తం ఏదో జరిగిపోతోందంటూ హల్‌చల్ చేశారు… ప్రెస్‌మీట్ల నుంచి బ్యానర్ కథనాలు వండివర్చారు. తీరా చూస్తే ఆ వార్త పెద్ద బోగస్ అని తేలింది. ఎల్లో మీడియా మెంబర్స్ వండి వార్చిన స్టోరీ అని తేలింది. ఇప్పుడు రాయిటర్స్ సంస్థ కూడా జరిగిన తప్పు తెలుసుకుంది. ఆ ట్వీట్‌పై వివరణ ఇచ్చింది.
కియా మోటార్స్ తరలింపు ట్వీట్ ను డిలీట్ చేసింది. తప్పుడు సమాచారం వల్లే కియా తరలింపు వార్త కథనం వచ్చిందని పేర్కొంది. ఇటు కియామోటార్స్ ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగుతామని ప్రకటించారు. ఆ సంస్థ ప్రతినిధులు లిఖిత పూర్వకంగా మీడియాకు తెలియజేశారు. అయితే ఈ వార్తలు మాత్రం ఎల్లో మీడియాకు కనిపించడం లేదు.