Telugu Global
International

డెడ్ సిటీగా మారిన వుహాన్

కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. దాదాపు 30వేల మందికిపైగా వైరస్ సోకింది. దీన్ని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. అయితే కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలోని30వ వూహాన్ లో మాత్రం పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో నగరంలోని వాసులంతా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. వైరస్ నగరం […]

డెడ్ సిటీగా మారిన వుహాన్
X

కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. దాదాపు 30వేల మందికిపైగా వైరస్ సోకింది. దీన్ని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది.

అయితే కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలోని30వ వూహాన్ లో మాత్రం పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో నగరంలోని వాసులంతా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. వైరస్ నగరం అంతటా వ్యాపించడంతో జీవచ్ఛవాళ్ళా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

వైరస్ తీవ్రతతో ఇళ్లు, అపార్ట్ మెంట్లను దాటి ప్రజలను బయటకు రానివ్వడం లేదు అక్కడి అధికారులు. ఎంత అత్యవసర పరిస్థితి అయినా ప్రజలను గడప దాటి బయటకు పంపించడం లేదు. ఇప్పటికే చైనాలో 563మంది కరోనా వైరస్ తో చనిపోగా.. 30వేల మందికి పైగా దీని బారిన పడ్డట్టు సమాచారం.

ప్రజలతో కళకళలాడిన వూహాన్ నగరం.. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు శ్మశానంగా మారిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి.. కరోనా మృతులతో మొత్తం డెడ్ సిటీగా మారిపోయింది.

వూహాన్ వాసులంతా ఇప్పుడు ఆస్పత్రులలో లేదా ఇంట్లో మాత్రమే ఉన్నారు. నగరంలోని అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నిత్యవసరాలకు సమస్య లేకుండా చైనా సర్కారు చూస్తోంది.

షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులను తెరిచి ఉంచింది. ప్రజలు కోరిన వస్తువులను ఇంటికే సరఫరా చేస్తోంది. ఈ వైరస్ తీవ్రత తగ్గేవరకు ప్రజలు బయటకు రావద్దని చైనా ప్రభుత్వం పిలుపునివ్వడంతో వూహాన్ వాసులు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు.

First Published:  9 Feb 2020 6:58 AM IST
Next Story