Telugu Global
NEWS

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌ రావుపై వేటు !

అవినీతిపై మ‌ళ్లీ కొర‌డా ఝ‌ళిపించింది ఏపీ స‌ర్కార్. ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం స‌హానీ ఆదేశాలు జారీ చేశారు. సెక్యూరిటీ ప‌రికరాల కొనుగోలు వ్య‌వ‌హారాల్లో అవ‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డాడని ఏబీపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీటిపై విచార‌ణ జ‌రిపిన ప్ర‌భుత్వం…ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేల‌డంతో స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కొన్నాళ్లు విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత ఇంటెలిజెన్స్ […]

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌ రావుపై వేటు !
X

అవినీతిపై మ‌ళ్లీ కొర‌డా ఝ‌ళిపించింది ఏపీ స‌ర్కార్. ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం స‌హానీ ఆదేశాలు జారీ చేశారు.

సెక్యూరిటీ ప‌రికరాల కొనుగోలు వ్య‌వ‌హారాల్లో అవ‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డాడని ఏబీపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీటిపై విచార‌ణ జ‌రిపిన ప్ర‌భుత్వం…ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేల‌డంతో స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కొన్నాళ్లు విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియ‌మితుల‌య్యాడు. నిఘా బాస్‌గా పూర్తిగా టీడీపీ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేశార‌ని అప్ప‌ట్లోనే ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

నిఘా బాస్‌గా ఉన్న‌ప్పుడు ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత ఆ ఆరోప‌ణ‌ల‌పై శాఖాప‌ర‌మైన విచార‌ణ చేయించింది. ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘించి కుమారుడు చేత‌న్ సాయికృష్ణ కంపెనీకి టెండ‌ర్ ద‌క్కేలా ఏబీ పావులు క‌దిపాడు.

అడిష‌న‌ల్ డీజీగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో సెక్యూరిటీ ప‌రిక‌రాల కొనుగోళ్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డాడని తేలింది. సెక్యూరిటీ పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ కొడుకు చేత‌న్ సాయి కృష్ణ కంపెనీ ‘ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్ ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీకి చెందేలా చేశార‌ని విచార‌ణ‌లో రుజువైంది.

ఉద్దేశపూర్వకంగా ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్, ప్రక్రియల సమాచారాన్ని విదేశీ రక్షణ తయారీ కంపెనీ లకు ఏబీ వెంకటేశ్వరరావు అందించాడని…. ఇది దేశానికే పెను ముప్పు గా ప్రభుత్వం ప‌రిగ‌ణించింది. ప్రాథమిక ఆధారాలు, నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా ఏబీ వెంకటేశ్వరరావు ను ప్రభుత్వం స‌స్పెండ్ చేసింది. టెండర్ ప్రక్రియలో నిబంధనలు తుంగలో తొక్కి, సాంకేతిక అంశాలను విస్మరించి కాంట్రాక్టర్ కు మేలు చేసేలా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి.

మ‌రోవైపు దేశ‌, రాష్ట్ర భ‌ద్ర‌త‌కు ప్ర‌మాదం వాటిల్లేలా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ఉంద‌ని విచార‌ణ‌లో తేలింద‌ని…దీంతో పాటు టెండ‌ర్ ప్రాసెస్ పాటించాల్సిన రూల్స్ ను కూడా ఏం పాటించ‌లేదని విచారణలో తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇత‌ర అధికారులు లేవ‌నెత్తిన అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని….మొత్తం వ్య‌వ‌హారంలో ఆయ‌న ప‌క్ష‌పాత వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించాడని సస్పెన్ష‌న్ ఉత్త‌ర్వులో పేర్కొన్నారు. స‌స్పెన్ష‌న్ కాలంలో విజ‌య‌వాడ విడిచి వెళ్లరాద‌ని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

First Published:  8 Feb 2020 10:12 PM GMT
Next Story