శివాజీ మళ్లీ వచ్చాడు… ఆవేశంగా అయినా నిజమే చెప్పాడు
అప్పట్లో ఆపరేషన్ గరుడతో పరేషాన్ చేసిన సినీ నటుడు శివాజీ.. మళ్లీ ఆన్ స్క్రీన్ సందడి చేశాడు. తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. మీడియా ముందుకు వచ్చాడు. ఈ సారి అమరావతి గురించి మాట్లాడాడు. పరిపాలన ఎక్కడినుంచైనా చేసుకోవచ్చు.. కానీ ఆంధ్రుల రాజధాని అమరావతి మాత్రమే అని స్పష్టం చేశాడు. ఇది తథ్యమని అన్నాడు. అంతా బానే ఉంది కానీ.. 2019 శాసనసభ ఎన్నికలకు ముందు.. టీవీల్లో విస్తృతంగా కనిపించి.. ఆపరేషన్ గరుడ అంటూ లేనిపోని ప్రచారాలు […]
అప్పట్లో ఆపరేషన్ గరుడతో పరేషాన్ చేసిన సినీ నటుడు శివాజీ.. మళ్లీ ఆన్ స్క్రీన్ సందడి చేశాడు. తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. మీడియా ముందుకు వచ్చాడు. ఈ సారి అమరావతి గురించి మాట్లాడాడు. పరిపాలన ఎక్కడినుంచైనా చేసుకోవచ్చు.. కానీ ఆంధ్రుల రాజధాని అమరావతి మాత్రమే అని స్పష్టం చేశాడు. ఇది తథ్యమని అన్నాడు.
అంతా బానే ఉంది కానీ.. 2019 శాసనసభ ఎన్నికలకు ముందు.. టీవీల్లో విస్తృతంగా కనిపించి.. ఆపరేషన్ గరుడ అంటూ లేనిపోని ప్రచారాలు చేసిన శివాజీ.. కొన్నాళ్లకు మాయమయ్యాడు. తర్వాత టీవీ 9 వ్యవహారాల్లో తన స్నేహితుడు రవి ప్రకాశ్ తో కలిసి న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. అప్పుడప్పుడూ టీవీల్లో కనిపిస్తున్నా.. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల కారణంగా.. ఇంటికే పరిమతం అవుతున్నాడు.
మధ్యలో ఓ సారి టీవీ9 గొడవ జరుగుతున్న సమయంలో వేరే దేశానికి పారిపోయేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. ఇంతలో.. భక్తి పుట్టుకొచ్చి తిరుమలకు వచ్చాడు. మీడియా మైకు దొరకంగానే.. అమరావతి జపం అందుకున్నాడు. పనిలో పనిగా ఓ మాట అనేశాడు. పరిపాలన ఎక్కడినుంచైనా చేసుకోవచ్చని అన్నాడు. అంటే.. పరిపాలన వికేంద్రీకరణకు ఆయన మద్దతు పలికినట్టే కదా.
ఇంకోటి.. ఆంధ్రుల రాజధాని అమరావతి మాత్రమే అన్నాడు. ఎవరు కాదన్నారు? వైసీపీ పెద్దలే ఆ మాట చెబుతున్నారు కదా. పరిపాలన సౌలభ్యం కోసం మరో రెండు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తున్నామే తప్ప.. అమరావతి నుంచి రాజధాని ఎక్కడికీ తరలదు అని స్పష్టం చేస్తున్నారు కదా. మళ్లీ ఇందులో ఇంత ఆవేశం ఎందుకు? ఏది ఏమైనా.. శివాజీ ఆవేశంగా అయినా.. నిజాలే చెప్పాడు అంటున్నారు.. చాలా మంది.