Telugu Global
National

ప్రధాని మోడీ మాటలు కట్ చేసిన రాజ్యసభ ఛైర్మన్

జమ్మూకశ్మీర్ కు ఇన్నాళ్లూ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయంపై.. రాజ్యసభలో ఇటీవల వాడీ వేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాస్త ఆవేశంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. సంచలన కామెంట్లు చేశారు. ఆ నాడు జవహర్ లాల్ నెహ్రూ కోసమే దేశాన్ని విభజించారని అన్నారు. అప్పటి నుంచే సమస్య మొదలైందని చెప్పారు. తర్వాత.. తెలంగాణ ఏర్పాటు తీరునూ ప్రస్తావించారు. పార్లమెంటు తలుపులు మూసేసి.. ఆంధ్రప్రదేశ్ ను విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు […]

ప్రధాని మోడీ మాటలు కట్ చేసిన రాజ్యసభ ఛైర్మన్
X

జమ్మూకశ్మీర్ కు ఇన్నాళ్లూ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయంపై.. రాజ్యసభలో ఇటీవల వాడీ వేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాస్త ఆవేశంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. సంచలన కామెంట్లు చేశారు. ఆ నాడు జవహర్ లాల్ నెహ్రూ కోసమే దేశాన్ని విభజించారని అన్నారు. అప్పటి నుంచే సమస్య మొదలైందని చెప్పారు. తర్వాత.. తెలంగాణ ఏర్పాటు తీరునూ ప్రస్తావించారు.

పార్లమెంటు తలుపులు మూసేసి.. ఆంధ్రప్రదేశ్ ను విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మోడీ. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై.. గతంలోనూ మోడీ తీవ్ర అసంతృప్తిని పార్లమెంటు వేదికగా పలుమార్లు వ్యక్తం చేశారు. తాము ఏర్పాటు చేసిన రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని.. ఎలాంటి వివాదాలు లేకుండా తాము కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశామని చెప్పేవారు. ఇప్పుడు మరోసారి ఆర్టికల్ 370పై మాట్లాడుతూ.. తెలంగాణను కూడా చర్చల్లోకి తెచ్చారు.

ఇదంతా.. తీవ్ర వివాదాస్పదమైంది. విపక్షాలు మోడీ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. నిరసనలు తెలిపాయి. చివరికి ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పందించాల్సి వచ్చింది. చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మోడీ చేసిన వ్యాఖ్యల్లో.. కొంత భాగాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. ప్రధానిగా ఉంటూ.. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనాల్సి రావడం.. మోడీకి మాత్రమే కాదు.. బీజేపీ నాయకులకూ ఇది కాస్త కష్టంగానే ఉంది.

ఈ విషయంపై.. కాంగ్రెస్ నేతలు, పలు ఇతర పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. ఇప్పటికైనా మోడీ.. కాస్త జాగ్రత్తగా మాట్లాడితే ఆయనకే కాదు.. ఆయన పదవికి కూడా గౌరవంగా ఉంటుందని సూచిస్తున్నారు.

First Published:  8 Feb 2020 12:31 AM GMT
Next Story