కియా చెప్పేసింది.... అనంతపురం దాటేది లేదంటోంది
కియా మోటార్స్ ఎండీ కుక్ యున్ కీలక ప్రకటన చేశారు. అనంతపురంలో ఉన్న తమ ప్లాంట్ ను ఎక్కడికీ తరలించేది లేదని స్పష్టం చేశారు. అనంతపురమే తమ కేంద్రమని…. అక్కడి నుంచే అంతర్జాతీయ స్థాయి కార్ల ఉత్పత్తి కొనసాగుతుందని…. తాము అక్కడ 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టామని వివరించారు. తమ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో కార్యక్రమానికి… రాష్ట్ర […]
కియా మోటార్స్ ఎండీ కుక్ యున్ కీలక ప్రకటన చేశారు. అనంతపురంలో ఉన్న తమ ప్లాంట్ ను ఎక్కడికీ తరలించేది లేదని స్పష్టం చేశారు.
అనంతపురమే తమ కేంద్రమని…. అక్కడి నుంచే అంతర్జాతీయ స్థాయి కార్ల ఉత్పత్తి కొనసాగుతుందని…. తాము అక్కడ 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టామని వివరించారు. తమ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చేశారు.
న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో కార్యక్రమానికి… రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డితో కలిసి కియా ఎండీ కుక్ యున్ ఈ విషయాన్ని వెల్లడించారు. తప్పుడు కథనాలు పట్టించుకోవద్దని కోరారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యం లోని రాష్ట్ర ప్రభుత్వం తమకు సరైన సహకారాన్ని అందిస్తోందని స్పష్టం చేశారు. తమకు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయే ఆలోచనేదీ లేదని కుండ బద్ధలు కొట్టారు.
ఇంత స్పష్టంగా కియా మేనిజింగ్ డైరెక్టర్ ఈ మాట చెబుతున్నా…. ఇంకా కొందరు మాత్రం తరలింపు ఊహాగానాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. వందల కోట్ల పెట్టుబడి…. వేలాది ఉద్యోగావకాశాలు.… పరోక్ష ఉపాధి మార్గాలు…. ఇవన్నీ అనంతపురానికి ఆలంబనగా నిలుస్తుంటే…. కొందరు కావాలని లేని ముచ్చటను జనాల్లోకి తీసుకువచ్చి ఆందోళనకు గురిచేస్తున్నారు.
అటు ప్రభుత్వం…. ఇటు కియా సంస్థ…. ఎక్కడికీ పోవడం లేదని.. ఎక్కడికీ వెళ్లే అవకాశం లేదని కూడా…. పదే పదే చెబుతుంటే పట్టించుకోకుండా…. కియాను బలవంతంగా తరలిపోయేలా చేసి ఆనందించాలని కొందరు చూస్తున్నారంటూ ప్రజలు కూడా ఆగ్రహిస్తున్నారు.