Telugu Global
NEWS

న్యూజిలాండ్ తో భారత్ డూ ఆర్ డై

రెండోవన్డే నెగ్గితేనే సిరీస్ ఆశలు సజీవం భారత్-న్యూజిలాండ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది.తొలివన్డేలో సూపర్ చేజింగ్ విజయం సాధించిన కివీజట్టు వరుసగా రెండో విజయంతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంటే…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు మాత్రం ఆరునూరైనా మ్యాచ్ నెగ్గి..సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తోంది. అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ రెండోవన్డే కివీస్ కు చెలగాటం, విరాట్ సేనకు సిరీస్ సంకటంగా మారింది. రగిలిపోతున్న భారత్…. గత […]

న్యూజిలాండ్ తో భారత్ డూ ఆర్ డై
X
  • రెండోవన్డే నెగ్గితేనే సిరీస్ ఆశలు సజీవం

భారత్-న్యూజిలాండ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది.తొలివన్డేలో సూపర్ చేజింగ్ విజయం సాధించిన కివీజట్టు వరుసగా రెండో విజయంతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంటే…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు మాత్రం ఆరునూరైనా మ్యాచ్ నెగ్గి..సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తోంది.

అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ రెండోవన్డే కివీస్ కు చెలగాటం, విరాట్ సేనకు సిరీస్ సంకటంగా మారింది.

రగిలిపోతున్న భారత్….

గత ఏడాది ముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న విరాట్ సేన…ఆ పరాజయాన్ని పూర్తిగా మరచిపోకముందే…హామిల్టన్ వేదికగా జరిగిన ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డేలో సైతం పరాజయం పొందడాన్ని భారత టీమ్ మేనేజ్ మెంట్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. 347 పరుగుల భారీ స్కోరు సాధించినా…బౌలింగ్ వైఫల్యంతో ఓటమి పొందడాన్ని భరించలేకపోతోంది.

తొలివన్డేలో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకొని…రెండోవన్డేలో దెబ్బతిన్న బెబ్బులిలా పోరాడాలన్న కసితో విరాట్ అండ్ కో బరిలోకి దిగనున్నారు.

లెఫ్టామ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్ధానంలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ ను, ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు బదులుగా యువఫాస్ట్ బౌలర్ నవదీవ్ సైనీని తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు లేకపోలేదు.

కివీజట్టులో కైల్ జామీసన్…

మరోవైపు…ఆతిథ్య న్యూజిలాండ్…లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ కైల్ జామీసన్ ను తుదిజట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది. చిన్నబౌండ్రీలతో… బ్యాటింగ్ కు అనువుగా ఉండే అక్లాండ్ స్టేడియంలో 280కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. దీనికితోడు… ఈదురుగాలుల వాతావరణంలో బౌలింగ్, ఫీల్డింగ్ సైతం విరాట్ సేన సత్తాకు సవాలుకానుంది.

భారత్ ఆత్మవిశ్వాసం…

ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా నిర్వహించిన రెండుకు రెండు మ్యాచ్ ల్లోనూ భారతజట్టే విజేతగా నిలవడంతో…వన్డేలో సైతం గెలుపు తమదేనన్న ధీమా విరాట్ సేనలో కనిపిస్తోంది.

ఓపెనర్లు మయాంక్ -పృథ్వీ షా అందించే ఆరంభంతో పాటు…కెప్టెన్ కొహ్లీ, రాహుల్, అయ్యర్లు పూర్తిస్థాయిలో బ్యాట్ కు పనిచెబితేనే …సిరీస్ ను నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది.

బౌలింగ్ లో బుమ్రా తన మ్యాజిక్ ప్రదర్శించకపోతే…స్పిన్ జోడీ కుదురుగా బౌలింగ్ చేయకపోతే భారత్ కు కష్టాలు తప్పవు.

First Published:  8 Feb 2020 3:22 AM IST
Next Story