Telugu Global
National

విరాట్ కొహ్లీ బ్రాండ్ విలువ పై పైకి...

39 శాతం పెరిగిన బ్రాండ్ వాల్యూ క్రికెటర్ గా మాత్రమే వార్తల్లో నిలిచే భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…బ్రాండ్ మార్కెట్లోనూ ప్రముఖంగా కనిపిస్తున్నాడు. తన బ్రాండ్ విలువను ఏడాది ఏడాదికీ పెంచుకొంటూ తనకుతానే సాటిగా నిలుస్తూ వస్తున్నాడు. గత మూడేళ్ల కాలంగా భారత బ్రాండ్ మార్కెట్లో నంబర్ వన్ గా నిలుస్తూ వచ్చిన విరాట్ కొహ్లీ…మార్కెట్ తాజా అంచనాల ప్రకారం…తన బ్రాండ్ విలువను 39 శాతం మేర పెంచుకోగలిగినట్లు గ్లోబల్ సలహా సంస్థ డుఫ్ అండ్ ఫెల్ప్స్ వెల్లడించింది. విరాట్ […]

విరాట్ కొహ్లీ బ్రాండ్ విలువ పై పైకి...
X
  • 39 శాతం పెరిగిన బ్రాండ్ వాల్యూ

క్రికెటర్ గా మాత్రమే వార్తల్లో నిలిచే భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…బ్రాండ్ మార్కెట్లోనూ ప్రముఖంగా కనిపిస్తున్నాడు. తన బ్రాండ్ విలువను ఏడాది ఏడాదికీ పెంచుకొంటూ తనకుతానే సాటిగా నిలుస్తూ వస్తున్నాడు.

గత మూడేళ్ల కాలంగా భారత బ్రాండ్ మార్కెట్లో నంబర్ వన్ గా నిలుస్తూ వచ్చిన విరాట్ కొహ్లీ…మార్కెట్ తాజా అంచనాల ప్రకారం…తన బ్రాండ్ విలువను 39 శాతం మేర పెంచుకోగలిగినట్లు గ్లోబల్ సలహా సంస్థ డుఫ్ అండ్ ఫెల్ప్స్ వెల్లడించింది.

విరాట్ కొహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న వివిధ సంస్థల బ్రాండ్ విలువను మదింపు చేయడం ద్వారా ..బ్రాండ్ విరాట్ వాల్యూను ఖరారు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇతర భారత క్రికెటర్ల బ్రాండ్ విలువ ర్యాంకింగ్స్ లో మహేంద్రసింగ్ ధోనీ 9, సచిన్ టెండుల్కర్ 15, రోహిత్ శర్మ 20 స్థానాల్లో కొనసాగుతున్నారు.

237.5 మిలియన్ డాలర్లుకు బ్రాండ్ విరాట్..

2019 మార్కెట్ అంచనాల ప్రకారం విరాట్ కొహ్లీ బ్రాండ్ విలువ 237.5 మిలియన్ డాలర్లకు చేరినట్లు డుఫ్ సంస్థ తేల్చి చెప్పింది. బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, దీపిక పడుకోన్, రనవీర్ సింగ్, షారుఖ్ ఖాన్ లను విరాట్ కొహ్లీ మించి పోయినట్లుగా మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. విరాట్ కొహ్లీ తర్వాతి స్థానంలో అక్షయ్ కుమార్ కొనసాగుతున్నాడు.

2019 సీజన్ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 2455 పరుగులు సాధించడం తో పాటు…ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా, అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా, నిలకడగా రాణించడం ద్వారా విరాట్ కొహ్లీ…తన బ్రాండ్ విలువను అనూహ్యంగా పెంచుకోగలిగాడు. 254 పరుగులు అత్యధిక స్కోరుతో విరాట్ ఏకంగా ఏడుశతకాలు నమోదు చేశాడు.

కెప్టెన్ గా అత్యధిక పరుగుల విరాట్…

అంతేకాదు…న్యూజిలాండ్ తో ముగిసిన తొలివన్డేలో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా..కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సౌరవ్ గంగూలీల పేరుతో ఉన్న రికార్డును కొహ్లీ తెరమరుగు చేశాడు.

సౌరవ్ గంగూలీ 148 వన్డేల్లో 5వేల 82 పరుగులు సాధిస్తే.. విరాట్ కొహ్లీ కేవలం 87 ఇన్నింగ్స్ లోనే 21 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలతో 5వేల 123 పరుగులు సాధించడం విశేషం.

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ …క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు…భారత బ్రాండ్ మార్కెట్లోనూ నంబర్ వన్ గా, తనకుతానే సాటిగా నిలుస్తూ…తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తున్నాడు.

First Published:  7 Feb 2020 5:56 AM IST
Next Story