Telugu Global
Cinema & Entertainment

'జాను' సినిమా రివ్యూ

రివ్యూ :జాను రేటింగ్ : 3/5 తారాగణం : శర్వానంద్, సమంత, గౌరి జి కిషన్, సాయి కిరణ్ కుమార్, వెన్నెల కిషోర్, శరణ్య ప్రదీప్, రఘు బాబు తదితరులు సంగీతం : గోవింద్ వసంత నిర్మాత : దిల్ రాజు దర్శకత్వం : సి ప్రేమ్ కుమార్ యువ హీరో శర్వానంద్, వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కలిసి తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన […]

జాను సినిమా రివ్యూ
X

రివ్యూ :జాను
రేటింగ్ : 3/5
తారాగణం : శర్వానంద్, సమంత, గౌరి జి కిషన్, సాయి కిరణ్ కుమార్, వెన్నెల కిషోర్, శరణ్య ప్రదీప్, రఘు బాబు తదితరులు
సంగీతం : గోవింద్ వసంత
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం : సి ప్రేమ్ కుమార్

యువ హీరో శర్వానంద్, వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కలిసి తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

‘జాను’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి … తమిళంలో ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమారే దర్శకత్వం వహించాడు. తమిళ్ సినిమా విడుదల కాకముందే చిత్ర రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న దిల్ రాజు స్వయంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించాడు. తమిళంలో ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన గోవింద్ వసంతే ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:

రామ్ (శర్వానంద్) ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్. సాహసాలు చేయడం అంటే ఇష్టం అయిన రామ్ ఒక రోజు తన పుట్టిన ఊరికి తిరిగి వస్తాడు. అప్పుడే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ రీ యూనియన్ పార్టీ కి వెళ్తాడు. అదే పార్టీకి తన ఫస్ట్ లవ్ జాను (సమంత) కూడా వస్తుంది. స్కూల్లో ఉన్నప్పటి నుంచి రామ్ కి జాను అంటే ప్రాణం. జాను ని పిచ్చి గా ప్రేమించిన రామ్ తన ప్రేమని మాత్రం ఎప్పుడూ బయట పెట్టలేదు. మరి ఇన్నాళ్ల తరువాత జాను ని మళ్లీ చూసిన రామ్ తన ప్రేమ విషయం చెప్తాడా? ఒకవేళ చెప్పినా ఒప్పుకుంటుందా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

శర్వానంద్ కి ఈ సినిమాలో చాలా వెయిట్ ఉన్న పాత్ర దక్కింది. విజయ్ సేతుపతి తో పోల్చకుండా ఒక నటుడిగా శర్వానంద్ ఈ సినిమాలో మంచి మార్కులు వేయించుకున్నాడు అని చెప్పుకోవచ్చు. రామ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి శర్వానంద్ చాలా అద్భుతంగా నటించాడు.

ఇక జాను పాత్రలో సమంత కూడా బాగా నటించింది. జాను చిన్నప్పటి పాత్రలో కనిపించిన గౌరీ జి.కిషన్ కూడా చాలా బాగా నటించింది. ఆమె నటన ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.

రామ్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన సాయి కిరణ్ కుమార్ కూడా తన పాత్రలో చాలా బాగా నటించాడు. వెన్నెల కిషోర్ మరియు శరణ్య ప్రదీప్ కూడా చాలా సహజంగా నటించారు. రఘు బాబు నటన బాగుంది.

సాంకేతిక వర్గం:

రీమేక్ సినిమా అయినప్పటికీ…. దర్శకుడు సి ప్రేమ్ కుమార్ కథను మాత్రమే కాకుండా దాదాపు అన్ని సన్నివేశాలని తెలుగులో కూడా ఏమాత్రం మార్పులు చేయకుండానే తెరకెక్కించారు. చిన్న చిన్న మార్పులు తప్ప కథ ప్రకారంగా దర్శకుడు ఏ మాత్రం మార్పు చేయలేదనే చెప్పుకోవాలి.

అయితే సినిమాని నెరేట్ చేసే విషయంలో మాత్రం ప్రేమ్ కుమార్ ఒరిజినల్ వెర్షన్ కి ఏ మాత్రం తగ్గకుండా ఎమోషన్ సినిమా మొత్తం క్యారి అయ్యేవిధంగా కథని చాలా బాగా తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తమిళ్ సినిమా కి సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించాడు. పాటలు బాగానే ఉన్నప్పటికీ నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు ఆయువుపట్టు గా మారింది. ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ గోవింద్ వసంత బిజీఎం చాలా బాగా వర్కౌట్ అయింది. మహీంద్రన్ జయరాజు అందించిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రవీణ్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

నటీనటులు, నెరేషన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్ సన్నివేశాలు

బలహీనతలు:

క్లైమాక్స్

బాటమ్ లైన్:

‘జాను’ రామ్ ల కథ మనసులను హత్తుకునే ఒక అద్భుతమైన అందమైన ప్రేమ కథ.

First Published:  7 Feb 2020 10:38 AM IST
Next Story