Telugu Global
NEWS

ఈ నేరంలో జేసీ బ్రదర్స్‌కు శిక్ష తప్పదా?

అనంతపురం జిల్లాలో ఒక సామ్రాజ్యాన్నే నిర్మించుకున్న జేసీ బ్రదర్స్‌ మొట్టమొదటిసారి పరిటాల రవికి భయపడ్డారు. రవి పేరు చెబితేనే వణికిపోయిన వీళ్ళు… పరిటాల రవి మరణానంతరం మళ్ళీ విజృంభించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరాక…. అనంతపురం జిల్లాలో వీళ్ళు ఆడిందే ఆట… పాడిందే పాట. వీళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ప్రశ్నించేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. బస్సులను అడ్డగోలుగా తిప్పారు. ఒక బస్సుకు ఒక నెంబర్‌ తో పర్మిట్‌ తీసుకుని… అదే […]

ఈ నేరంలో జేసీ బ్రదర్స్‌కు శిక్ష తప్పదా?
X

అనంతపురం జిల్లాలో ఒక సామ్రాజ్యాన్నే నిర్మించుకున్న జేసీ బ్రదర్స్‌ మొట్టమొదటిసారి పరిటాల రవికి భయపడ్డారు. రవి పేరు చెబితేనే వణికిపోయిన వీళ్ళు… పరిటాల రవి మరణానంతరం మళ్ళీ విజృంభించారు.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరాక…. అనంతపురం జిల్లాలో వీళ్ళు ఆడిందే ఆట… పాడిందే పాట.

వీళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ప్రశ్నించేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. బస్సులను అడ్డగోలుగా తిప్పారు. ఒక బస్సుకు ఒక నెంబర్‌ తో పర్మిట్‌ తీసుకుని… అదే నెంబర్‌, అదే పర్మిట్‌ పై అనేక బస్సులు తిప్పారు.

సున్నపురాతి గనుల లైసెన్స్‌ తీసుకుని ఫ్యాక్టరీ పెట్టకముందే కొన్ని కోట్ల రూపాయల ఖనిజాన్ని తవ్వి అమ్మేసుకున్నారు. ఇలా అనేక అక్రమ వ్యవహారాలు వీళ్ళ వ్యాపారాల్లో నడిచాయి. వీళ్ల ఇద్దరి నోటికి హద్దే లేదు.

జగన్‌ ను, వాళ్ళ కుటుంబాన్ని దుర్భాషలాడారు. కాలం మారింది. జగన్‌ అధికారంలోకి వచ్చారు.

జేసీ బ్రదర్స్‌ వైసీపీలోకి రావాలని చూశారు. కానీ జగన్‌ అంగీకరించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశంలోనే ఉండిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నా నోరు మాత్రం తగ్గలేదు. పోలీసులను కూడా నీచాతి నీచంగా మాట్లాడారు.

కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా… జేసీ బ్రదర్స్‌ వ్యవహారాల మీద విచారణలు ప్రారంభమయ్యాయి. అనేక వ్యాపారాల్లో కోర్టు బోను ఎక్కాల్సిన పరిస్థితి.

ఇప్పుడు తాజాగా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో జేసీ బ్రదర్స్‌కు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.

First Published:  7 Feb 2020 11:24 AM IST
Next Story