Telugu Global
NEWS

జూనియర్ ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్

ఫైనల్లో భారత్ తో బంగ్లాదేశ్ అమీతుమీ సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్స్ కు బంగ్లాదేశ్ తొలిసారిగా చేరుకొంది. పోచెఫ్స్ స్ట్రోమ్ వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో బంగ్లాజట్టు 6 వికెట్లతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. జోయ్ సూపర్ సెంచరీ…. ఫైనల్లో చోటు కోసం జరిగిన ఈ పోరులో ముందుగా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్న బంగ్లాదేశ్… ప్రత్యర్థి న్యూజిలాండ్ ను 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగుల స్కోరుకే కట్టడి […]

జూనియర్ ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్
X
  • ఫైనల్లో భారత్ తో బంగ్లాదేశ్ అమీతుమీ

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్స్ కు బంగ్లాదేశ్ తొలిసారిగా చేరుకొంది. పోచెఫ్స్ స్ట్రోమ్ వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో బంగ్లాజట్టు 6 వికెట్లతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.

జోయ్ సూపర్ సెంచరీ….

ఫైనల్లో చోటు కోసం జరిగిన ఈ పోరులో ముందుగా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్న బంగ్లాదేశ్… ప్రత్యర్థి న్యూజిలాండ్ ను 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగుల స్కోరుకే కట్టడి చేయగలిగింది. కివీ మిడిలార్డర్ ఆటగాడు వీలర్ 75 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

బంగ్లా బౌలర్లలో షరీఫుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టాడు. సమాధానంగా 212 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బంగ్లాజట్టు…ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లు నష్టపోయింది.

అయితే ..వన్ డౌన్ ఆటగాడు మహ్మద్ హసన్ జోయ్- హృదయ్ తో కలసి నాలుగో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో విజయం ఖాయం చేశాడు.

హసన్ జోయ్..127 బాల్స్ లో 13 బౌండ్రీలతో శతకం సాధిస్తే…హుస్సేన్, హృదయ్ చెరో 40 పరుగుల చొప్పున సాధించి తమ జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.

గ్రూప్ లీగ్ నుంచి సెమీస్ నాకౌట్ వరకూ నిలకడగా రాణిస్తూ వచ్చిన బంగ్లాదేశ్ …సూపర్ సండే టైటిల్ పైట్ లో నాలుగుసార్లు విజేత భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది.

హాట్ ఫేవరెట్ భారత్ వరుసగా మూడోసారి ప్రపంచకప్ ఫైనల్స్ చేరితే…బంగ్లాజట్టుకు ఇదే మొట్టమొదటి ప్రపంచకప్ పైనల్స్ కావడం విశేషం.

First Published:  7 Feb 2020 2:15 AM IST
Next Story