Telugu Global
NEWS

పబ్లిసిటీ లేకుండా.... ఏపీకి 8 నెలల్లోనే 1,252 కంపెనీల యూనిట్లు

కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా రెండు మూడు రోజులుగా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.. చంద్రబాబు అయితే బట్టలు చింపుకుంటున్నట్టు మీడియాల ఎదుట కియా విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం కంపెనీని తరిమేస్తోందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇవన్నీ తాను కష్టపడి తెచ్చానని దుఖి:స్తున్నాడు. చంద్రబాబు మొదటి నుంచి మీడియాను గుప్పిట పట్టి ఉచిత పబ్లిసిటీ చేయించుకోవడంలో… తిమ్మిని బమ్మిని చేయడంలో… దిట్ట. […]

పబ్లిసిటీ లేకుండా.... ఏపీకి 8 నెలల్లోనే 1,252 కంపెనీల యూనిట్లు
X

కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా రెండు మూడు రోజులుగా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.. చంద్రబాబు అయితే బట్టలు చింపుకుంటున్నట్టు మీడియాల ఎదుట కియా విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం కంపెనీని తరిమేస్తోందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇవన్నీ తాను కష్టపడి తెచ్చానని దుఖి:స్తున్నాడు.

చంద్రబాబు మొదటి నుంచి మీడియాను గుప్పిట పట్టి ఉచిత పబ్లిసిటీ చేయించుకోవడంలో… తిమ్మిని బమ్మిని చేయడంలో… దిట్ట. రూ.1 విలువగల పనిచేస్తే పబ్లిసిటీ కోసం ఏకంగా రూ.10 ఖర్చు చేసే రకం అని విమర్శలున్నాయి. చంద్రబాబు పాలనలో ఏమైనా చేసినా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం వేసుకోగల నేర్పరితనం బాబు సొంతం.

అయితే జగన్ ప్రభుత్వం బాబుకు పూర్తి భిన్నంగా ముందుకెళుతోంది. ఎనిమిది నెలల్లో ఎంతో చేసినా పరిశ్రమలు తెచ్చినా జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదు. ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ జగన్ ఎటువంటి ప్రచారం కోసం ఆరాటపడకుండా తక్కువ ప్రొఫైల్ తో నిశ్శబ్ధంగా పనిచేసుకుంటూ పోతున్నాడని.. ఏపీకి చాలా చేస్తున్నారని చెప్పుకున్నాడు.

వైసీపీ పాలనలో గత 8 నెలల్లోనే 1,252 కంపెనీలు తమ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని.. వీటికి 1,057 ఎకరాలు కేటాయించామని బుగ్గన చెప్పారు. హుందాయ్ స్టీల్స్, పోస్కో స్టీల్స్ తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నాయని తెలిపారు.

గత జూన్ నుంచి నవంబర్ వరకు 15,600 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి జగన్ తీసుకొచ్చారని బుగ్గన సంచలన విషయాలు వెల్లడించారు. 7,916 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో 8 యూనిట్లు ఉత్పత్తిలో ట్రయల్ రన్ కు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

చంద్రబాబు పాలనలో 38వేల కోట్ల రూపాయల పనులు పూర్తి చేయలేక విడిచిపెట్టిందని.. సీఆర్డీఏ పనులను చేర్చినట్లయితే లక్షకోట్ల పనులు వదిలేసిందన్నారు. కానీ జగన్ సర్కారు పద్ధతిగా ముందుకెళుతోందని వివరించారు. ఇలా జగన్ ప్రచారానికి పోకుండా కృషి కొనసాగిస్తున్నారని మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు.

First Published:  7 Feb 2020 6:10 AM IST
Next Story