అధికార పార్టీని.... ఆయన వదులుకున్నట్టేనా?
గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎంపీ గురించి.. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. గెలిచిన పార్టీని కాదనుకుని.. ఆయన దిల్లీలో జాతీయ పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని గుసగుసలు షికార్లు చేస్తున్నాయి. సొంత పార్టీని కాదనుకుని మరీ.. ఇతర పార్టీల వారికి పార్టీలు ఇవ్వడం.. వారితో స్నేహంగా ఉండడం.. సొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం వంటి పరిణామాలు.. కేడర్ కు ఆయనకు మధ్య దూరాన్ని కూడా పెంచుతున్నట్టు.. ఓపన్ గానే చాలా మంది చెప్పేస్తున్నారు. ఇదంతా […]
గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎంపీ గురించి.. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. గెలిచిన పార్టీని కాదనుకుని.. ఆయన దిల్లీలో జాతీయ పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని గుసగుసలు షికార్లు చేస్తున్నాయి. సొంత పార్టీని కాదనుకుని మరీ.. ఇతర పార్టీల వారికి పార్టీలు ఇవ్వడం.. వారితో స్నేహంగా ఉండడం.. సొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం వంటి పరిణామాలు.. కేడర్ కు ఆయనకు మధ్య దూరాన్ని కూడా పెంచుతున్నట్టు.. ఓపన్ గానే చాలా మంది చెప్పేస్తున్నారు.
ఇదంతా పరిగణలోకి తీసుకున్న పార్టీ అధినేత.. సదరు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకున్నారని.. మరింత బలమైన నాయకత్వాన్ని తయారు చేశారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా ఎందుకు.. అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం దొరకడం లేదు. వెల్లువెత్తిన ప్రజాభిమానంతో.. అనూహ్య మెజారిటీతో విజయాన్ని సాధించి.. లోక్ సభ వరకూ వెళ్లి.. తన రాజకీయ జీవితాన్ని మరింత ఉన్నతం చేసుకున్న ఆ ఎంపీ.. తన గెలుపునకు కారణమైన పార్టీని ఇలా ఎందుకు కాదనుకుంటున్నారు.. అన్నది ప్రజలకు అయోమయంగా ఉంది.
పరిస్థితి ఎంత వరకూ వచ్చిందంటే.. పార్టీ నిర్ణయాలను ఖాతరు చేయకపోవడం.. పైగా.. వ్యతిరేకించడం.. బహిరంగంగా తప్పుబట్టడం వరకూ.. సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పట్లో ఇవి పునరుద్ధరణకు నోచుకునే అవకాశాలైతే కనిపించడం లేదని… గోదావరి జిల్లాల రాజకీయాలు బాగా తెలిసిన నేతలు, విశ్లేషకులు కచ్చితంగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో.. ఈ వైరం మరింత ఓపెన్ అయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి.. గోదారి గట్టుపై అటూ ఇటూగా ఉన్న ఆ ఎంపీ.. ఏం చేస్తాడో.. ఎటు వైపు దూకుతాడో. అంతా సీతా‘రామకృష్ణు’లకే ఎరుక.