నేపాల్ గడ్డపై మొట్టమొదటి వన్డే మ్యాచ్
ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం హిమాలయన్ కింగ్ డమ్ నేపాల్ చిరకాలస్వప్నం ఎట్టకేలకు నేరవేరింది. నేపాల్ గడ్డపై మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నిర్వహించే అవకాశం రానే వచ్చింది. ఐసీసీ గ్రేడ్ -2 జట్ల వన్డే ముక్కోణపు సిరీస్ కు కీర్తిపూర్ లోని త్రిభువన్ యూనివర్శిటీ గ్రౌండ్స్ వేదికగా నిలిచింది. ఆతిథ్య నేపాల్, అమెరికా, ఒమాన్ జట్లు తలపడుతున్న ఈ టోర్నీప్రారంభమ్యాచ్ లో నేపాల్ కు చేదుఅనుభవం ఎదురయ్యింది. తమ దేశం వేదికగా జరిగిన ఈ మొట్టమొదటి అంతర్జాతీయ […]
- ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం
హిమాలయన్ కింగ్ డమ్ నేపాల్ చిరకాలస్వప్నం ఎట్టకేలకు నేరవేరింది. నేపాల్ గడ్డపై మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నిర్వహించే అవకాశం రానే వచ్చింది.
ఐసీసీ గ్రేడ్ -2 జట్ల వన్డే ముక్కోణపు సిరీస్ కు కీర్తిపూర్ లోని త్రిభువన్ యూనివర్శిటీ గ్రౌండ్స్ వేదికగా నిలిచింది. ఆతిథ్య నేపాల్, అమెరికా, ఒమాన్ జట్లు తలపడుతున్న ఈ టోర్నీప్రారంభమ్యాచ్ లో నేపాల్ కు చేదుఅనుభవం ఎదురయ్యింది.
తమ దేశం వేదికగా జరిగిన ఈ మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వేలాదిమంది అభిమానులు ఎక్కడలేని ఉత్సాహంతో తరలి వచ్చారు.
ఈ చారిత్రాత్మక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఒమాన్ జట్టు 50 ఓవర్లలో 197 పరుగులు సాధించింది. మహ్మద్ నదీమ్ 96 బాల్స్ ఎదుర్కొని 69 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.
సమాధానంగా 198 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన నేపాల్ 179 పరుగులు మాత్రమే చేసి…18 పరుగుల ఓటమి మూటగట్టుకొంది. నేపాల్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ సందీప్ లామిచానే 27బాల్స్ లో 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది.
సొంతగడ్డపై తమజట్టు ఆడిన మ్యాచ్ ను కొండంత ఆశతో చూడటానికి వచ్చిన వేలాదిమంది అభిమానులకు చివరకు నిరాశ తప్పలేదు. నేపాల్ గడ్డపై ఎట్టకేలకు తొలి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించడం, ఆ మ్యాచ్ లో తాను జాతీయజట్టుకు నాయకత్వం వహించడం గర్వకారణమని నేపాల్ కెప్టెన్ జ్ఞానేంద్ర మల్లా పొంగిపోతూ వచ్చాడు.
ఈ సిరీస్ లో భాగంగా జరిగే మొత్తం ఆరుమ్యాచ్ ల్లో నేపాల్, ఒమాన్, అమెరికాజట్లు రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో తలపడనున్నాయి.