Telugu Global
NEWS

విలేకరులకు శుభవార్త.... హోం గార్డులు, డ్రైవర్లకు కూడా..!

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అన్ని రంగాలలో సంక్షేమాన్ని అమలు చేస్తోంది. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచేలా పథకాలు తీసుకొచ్చింది. వీటిని గ్రామ సచివాలయాల ద్వారా సమర్థంగా అమలు చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థనూ అందుబాటులోకి తెచ్చింది. లక్షల నియామకాలు పూర్తి చేసింది. ఈ ఒరవడిలో.. మరో పథకాన్ని ప్రకటించింది.. జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులతో పాటు.. హోం గార్డులు, లారీ..బస్సు.. జీపు.. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం […]

విలేకరులకు శుభవార్త.... హోం గార్డులు, డ్రైవర్లకు కూడా..!
X

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అన్ని రంగాలలో సంక్షేమాన్ని అమలు చేస్తోంది. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచేలా పథకాలు తీసుకొచ్చింది. వీటిని గ్రామ సచివాలయాల ద్వారా సమర్థంగా అమలు చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థనూ అందుబాటులోకి తెచ్చింది. లక్షల నియామకాలు పూర్తి చేసింది. ఈ ఒరవడిలో.. మరో పథకాన్ని ప్రకటించింది.. జగన్ ప్రభుత్వం.

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులతో పాటు.. హోం గార్డులు, లారీ..బస్సు.. జీపు.. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో లబ్ధిదారుల తరఫున ప్రభుత్వమే బీమా సంస్థలకు ప్రీమియం చెల్లిస్తుంది. పథకం పరిధిలోకి వచ్చేవారెవరూ పైసా కట్టాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని.. రాష్ట్ర కార్మిక శాఖ ప్రకటించింది.

మరో విశేషం ఏంటంటే.. గత ఏడాది డిసెంబర్ 18 నుంచే ఈ పథకం అమల్లోకి తెచ్చామని.. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు అర్హులని.. ప్రమాదవశాత్తూ మరణించిన వారికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆర్థిక భద్రత కల్పిస్తుందని కార్మిక శాఖ తెలిపింది. ఈ పథకంతో.. వర్కింగ్ జర్నలిస్టులు, హోం గార్డులు, జీపు, ఆటో, బస్సు, లారీ డ్రైవర్లు సంతోషిస్తున్నారు.

First Published:  6 Feb 2020 5:18 AM IST
Next Story