కేరళలో పని చేసే ఐపీఎస్.. తెలంగాణలో మంత్రి కాబోతున్నాడా?
కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సృష్టించిన ఓ వార్త.. సోషల్ మీడియాలోనే కాదు.. సామాన్య ప్రజానీకంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేరళకు చెందిన సీనియర్, పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారి ఒకరిని తెలంగాణకు రప్పించి రాజకీయాల్లో చేర్పించడమే కాదు.. ఏకంగా మంత్రి పదవిని కూడా ఇచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది. అది కూడా.. ఫిబ్రవరిలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. పని కానిచ్చేస్తారన్న విషయం.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. హరీష్ […]
కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సృష్టించిన ఓ వార్త.. సోషల్ మీడియాలోనే కాదు.. సామాన్య ప్రజానీకంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కేరళకు చెందిన సీనియర్, పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారి ఒకరిని తెలంగాణకు రప్పించి రాజకీయాల్లో చేర్పించడమే కాదు.. ఏకంగా మంత్రి పదవిని కూడా ఇచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అది కూడా.. ఫిబ్రవరిలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. పని కానిచ్చేస్తారన్న విషయం.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది.
ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. హరీష్ రావు శాఖ మార్పు. సదరు ఐపీఎస్ అధికారికి ఏకంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చేస్తారట. హరీష్ రావు చేతిలో ఉన్న ఈ శాఖను మార్చడం అంటే.. పెద్ద రాజకీయ చర్య అనే చెప్పుకోవాలి. ఇన్నాళ్లూ హరీష్ కు మంత్రి పదవి లేదు.. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు అని ఆగ్రహోదగ్రులైన ఆయన అనుచరులు, అభిమానులు.. ఈ గుసగుస నిజమైతే ఊరుకుంటారా? ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియనిదా అన్న ప్రశ్నలకు.. ఏమో ఎవరికి ఎరుక అన్న సమాధానమే వినిపిస్తోంది.
ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి కానీ.. టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్య రాలేదు. కేవలం సోషల్ మీడియాలోనే విస్తృత ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు.. ఎప్పటిలాగే తన సైలెన్స్ ను మరోసారి వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు. ఆయనంతటగా ఆయన నోరు విప్పి సమాధానం చెబితే తప్ప.. తన మంత్రి పదవి ఊస్టింగ్ అన్నది నిజమైన వార్తో.. పుకారుగా పుట్టిందో అన్నది స్పష్టత రాదు.