కళా వెంకట్రావు సీటుకు ఎసరు పెడుతున్నారా?
అధికారం కోల్పోయి 10 నెలలవుతోంది. తెలుగుదేశం పార్టీలో జోష్ లేదు. చంద్రబాబు సీనియర్ అయిపోయారు. ఆయన వయస్సు 70 దాటుతోంది. యువనేతకు చరిష్మా లేదు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఊపు తెచ్చేది ఎలా? ఇప్పుడు టీడీపీ శ్రేణుల ముందు ఉన్న ప్రశ్న ఇదే. తెలంగాణలో పార్టీ క్లోజ్. వార్డు మెంబర్లకు పోటీ చేసేందుకు నేతలు లేరు. పార్టీకి లీడర్లు ఎక్కడ ఉంటారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి కళా వెంకట్రావు ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ […]
అధికారం కోల్పోయి 10 నెలలవుతోంది. తెలుగుదేశం పార్టీలో జోష్ లేదు. చంద్రబాబు సీనియర్ అయిపోయారు. ఆయన వయస్సు 70 దాటుతోంది. యువనేతకు చరిష్మా లేదు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఊపు తెచ్చేది ఎలా? ఇప్పుడు టీడీపీ శ్రేణుల ముందు ఉన్న ప్రశ్న ఇదే.
తెలంగాణలో పార్టీ క్లోజ్. వార్డు మెంబర్లకు పోటీ చేసేందుకు నేతలు లేరు. పార్టీకి లీడర్లు ఎక్కడ ఉంటారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి కళా వెంకట్రావు ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన పేరుకే అధ్యక్షుడు. కానీ ఆయనకు వాయిస్ లేదు. ప్రభావం చూపగలిగిన నేత కాదు.
జగన్ మూడు రాజధానుల బాణంతో ఉత్తరాంధ్రలో టీడీపీకి గడ్డు పరిస్థితి వచ్చింది. కక్కలేక మింగలేని పరిస్థితి. సీనియర్ నేత అచ్చెన్నాయుడి నోటికి మూడు రాజధానుల తాళం పడింది. మూడు జిల్లాలో పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు.
మూడు రాజధానుల ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్రలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. దీంతో అక్కడ పార్టీని లేపేందుకు ఏదో ఒకటి చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు తాను ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పేందుకు కొన్ని పాచికలు విసిరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో మొదటి పాచిక అచ్చెన్నాయుడు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అచ్చెన్నాయుడు ప్రస్తుతం టెక్కలి ఎమ్మెల్యే. మాజీ మంత్రి. శ్రీకాకుళంతో పాటు విశాఖలో అచ్చెన్నకు కొంచెం పట్టుంది. దీంతో ఆయన్ని నియమించాలనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారట.