Telugu Global
NEWS

ప్రపంచకప్ ఫైనల్లో భారత కుర్రాళ్లు

పాక్ తో సెమీస్ లో అదరగొట్టిన యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగిన పానీపూరీ కుర్రాడు జూనియర్ ప్రపంచకప్ ఫైనల్స్ కు నాలుగుసార్లు విజేత భారత్ దూసుకెళ్లింది. సౌతాఫ్రికా వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2020 అండర్ -19 ప్రపంచకప్ తొలిసెమీఫైనల్లో చిరకాలప్రత్యర్థి పాకిస్థాన్ ను 10 వికెట్లతో భారత్ చిత్తు చేసి ఏడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. వరుసగా మూడోసారి ఫైనల్స్ చేరుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది. పోచెఫ్స్ స్ట్ర్రోమ్ వేదికగా జరిగిన తొలి సెమీస్ సమరంలో భారత్ విశ్వరూపమే ప్రదర్శించింది. […]

ప్రపంచకప్ ఫైనల్లో భారత కుర్రాళ్లు
X
  • పాక్ తో సెమీస్ లో అదరగొట్టిన యశస్వీ జైస్వాల్
  • సెంచరీతో చెలరేగిన పానీపూరీ కుర్రాడు

జూనియర్ ప్రపంచకప్ ఫైనల్స్ కు నాలుగుసార్లు విజేత భారత్ దూసుకెళ్లింది. సౌతాఫ్రికా వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2020 అండర్ -19 ప్రపంచకప్ తొలిసెమీఫైనల్లో చిరకాలప్రత్యర్థి పాకిస్థాన్ ను 10 వికెట్లతో భారత్ చిత్తు చేసి ఏడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. వరుసగా మూడోసారి ఫైనల్స్ చేరుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది.

పోచెఫ్స్ స్ట్ర్రోమ్ వేదికగా జరిగిన తొలి సెమీస్ సమరంలో భారత్ విశ్వరూపమే ప్రదర్శించింది. భారత కుర్రాళ్లకు ప్రత్యర్థి పాక్ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

172 పరుగులకే పాక్ టపటపా……

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ కు దిగిన భారత్ ప్రత్యర్థి పాక్ జట్టును కేవలం 43.1 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూల్చింది. భారత ఫాస్ట్ బౌలర్లు మిశ్రా, కార్తీక్ త్యాగీ కలసి 5 వికెట్లు పడగొడితే…లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ 2 వికెట్లు, యశస్వి, అన్ కోల్కేర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ ఆటగాళ్లలో కెప్టన్ రోహెల్ నజీర్ 62 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

భారత ఓపెనర్ల జోరు

173 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్- సక్సేనాల జోడీ అజేయ సెంచరీ భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంబాన్ని ఇచ్చారు.

భారత క్రికెట్ వర్గాలలో పానీపూరీ కుర్రాడిగా పేరుపొందిన యశస్వి జైశ్వాల్…తన బ్యాట్ కు పూర్తి స్థాయిలో పని చెప్పి అజేయ సెంచరీ సాధించాడు.

యశస్వి మొత్తం 113 బంతులు ఎదుర్కొని 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ సక్సేనా 99 బాల్స్ లో 6 బౌండ్రీలతో 55 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. భారత్ కేవలం 35.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 176 పరుగుల విజయంతో వరుసగా మూడోసారి ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది.

పానీపూరి కుర్రాడి ఆనందం…

పాకిస్థాన్ ప్రత్యర్థిగా సెమీఫైనల్లో ప్రపంచకప్ శతకం బాదటం తన జీవితంలో మరువలేని అనుభూతినిచ్చినట్లు భారత ఓపెనర్ , పానీపూరీ కుర్రాడు యశస్వీ జైశ్వాల్ పొంగిపోతూ చెప్పాడు.

ప్రస్తుత ప్రపంచకప్ ఐదుమ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిచిన యశస్వి…ప్రపంచకప్ సాధించడమే తన లక్ష్యమని ప్రకటించాడు.

న్యూజిలాండ్- బంగ్లాదేశ్ జట్ల రెండో సెమీఫైనల్లో నెగ్గిన జట్టుతో భారత్ ఫైనల్లో తలపడాల్సి ఉంది.

First Published:  5 Feb 2020 2:36 AM IST
Next Story