కేజ్రీవాల్ కు మద్దతుగా.... ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్.. విలక్షణ నటుడే కాదు.. రాజకీయాలమీద ఎంతో లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. విపరీతంగా చదువుతాడు… రాస్తాడు కూడా. తనకు నచ్చనిది ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ప్రకాష్ రాజ్ కు బీజేపీ అంటే అస్సలు పడదు. ఆయన బీజేపీ హిందుత్వ రాజకీయాలపై మొన్నటి ఎన్నికల ముందర పెద్ద ఫైటే చేశారు. బీజేపీ కి వ్యతిరేకంగా బెంగళూరులో ఎంపీగానూ పోటీచేశారు. అయితే జనాలు మాత్రం అదే బీజేపీని గెలిపించి ప్రకాష్ రాజ్ ను ఓడించారు. అయినా […]

ప్రకాష్ రాజ్.. విలక్షణ నటుడే కాదు.. రాజకీయాలమీద ఎంతో లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. విపరీతంగా చదువుతాడు… రాస్తాడు కూడా. తనకు నచ్చనిది ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ప్రకాష్ రాజ్ కు బీజేపీ అంటే అస్సలు పడదు. ఆయన బీజేపీ హిందుత్వ రాజకీయాలపై మొన్నటి ఎన్నికల ముందర పెద్ద ఫైటే చేశారు. బీజేపీ కి వ్యతిరేకంగా బెంగళూరులో ఎంపీగానూ పోటీచేశారు. అయితే జనాలు మాత్రం అదే బీజేపీని గెలిపించి ప్రకాష్ రాజ్ ను ఓడించారు.
అయినా ఆయన తన అభిప్రాయాలను వదులుకోలేదు. దేశ రాజకీయాలపై తన అభిప్రాయాలను వినిపిస్తూనే ఉన్నారు.
తాజాగా ఢిల్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఫైట్ యమ రంజుగా సాగుతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై బీజేపీ నేతలు దారుణ విమర్శలు చేస్తున్నారు. ఈసీ నిషేధం విధించినా… బీజేపీ నేతలు మాత్రం కేజ్రీవాల్ ను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అయితే తాజాగా బీజేపీపై ప్రకాష్ రాజ్ నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా కడిగిపారేశారు. ‘గోలీ బిర్యానీ టెర్రరిస్టుల హేట్ స్పీచ్’ అంటూ మత ప్రాదిపదికన బీజేపీ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు ఎన్నికల ప్రచారంలో మాట్లాడేందుకు ఇంతకంటే మంచి మాటలు కానీ అంశాలు కానీ లేవా అని ప్రశ్నించాడు. ఇలా మాట్లాడిన వారికి సిగ్గుండాలని కడిగిపారేశారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ నేతలకు మింగుడుపడడం లేదు.
DELHI ELECTIONS. @BJP4India GOLI..BIRIYANI..TERRORISTS…HATE SPEECH.. don’t you have anything else to talk about #justasking SHAME ON YOU
— Prakash Raj (@prakashraaj) February 4, 2020