Telugu Global
NEWS

కేంద్రంతో బీజేపీ నేతలు విభేదిస్తారా? పోరాడతారా?

అమరావతిపై కేంద్రం తేల్చేసింది. రాజధాని నిర్ణయం.. ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని కేంద్రం తెలియజేసింది. అమరావతిని రాజధానిగా నోటిఫై చేశామని చెబుతూనే.. రాష్ట్రాలకే తమ రాజధానిని నిర్ణయించుకునే హక్కు ఉంటుందని తెలియజేసింది. ఈ నిర్ణయాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కానీ.. 3 రాజధానుల నిర్ణయాన్ని నేరుగా తప్పుబట్టకపోవడమే.. ఇక్కడ ప్రధాన అంశంగా పరిగణించాల్సి వస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల తీరు ఎలా ఉండబోతోంది? […]

కేంద్రంతో బీజేపీ నేతలు విభేదిస్తారా? పోరాడతారా?
X

అమరావతిపై కేంద్రం తేల్చేసింది. రాజధాని నిర్ణయం.. ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని కేంద్రం తెలియజేసింది. అమరావతిని రాజధానిగా నోటిఫై చేశామని చెబుతూనే.. రాష్ట్రాలకే తమ రాజధానిని నిర్ణయించుకునే హక్కు ఉంటుందని తెలియజేసింది. ఈ నిర్ణయాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కానీ.. 3 రాజధానుల నిర్ణయాన్ని నేరుగా తప్పుబట్టకపోవడమే.. ఇక్కడ ప్రధాన అంశంగా పరిగణించాల్సి వస్తోంది.

ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల తీరు ఎలా ఉండబోతోంది? ఆ పార్టీ వెంట నడుస్తున్న జనసేన ఎలా వ్యవహరిస్తుంది? అన్నది చర్చనీయాంశమైంది. ఇప్పటివరకూ.. బీజేపీ నేతలు 3 రాజధానుల ప్రతిపాదనను తిరస్కరిస్తూ చాలాసార్లు తమ అభిప్రాయాలు చెప్పారు. కేంద్రం చూస్తూ ఊరుకోదు.. అని ఒకరంటే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మరి కొందరు తేల్చి చెప్పారు. జనసేన కూడా…. ఇదే అభిప్రాయంతో ఉంది.

ఇప్పుడేమో కేంద్రం.. ‘గత ప్రభుత్వం చెప్పినట్టు చేశాం. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమే’ అని చెప్పేసింది. ఇలా చెప్పి ఓ రోజు కూడా గడిచిపోయింది. కానీ.. కన్నా లక్ష్మీ నారాయణ నుంచి జీవీఎల్ వరకూ ఎవరూ ఈ విషయంపై మాట్లాడలేదు. కేంద్రం అభిప్రాయంపై తమ స్పందన ఇవ్వలేదు. ఇదంతా అసంతృప్తికి సంకేతమా.. లేదంటే ముందుగానే వారికి ఉన్న సమాచారమా.. అన్నది మాత్రం స్పష్టం కావడం లేదు.

కానీ.. అమరావతినే రాజధానిగా కోరుకుంటున్న కొందరు బీజేపీ నేతలు.. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదే.. అన్న కేంద్రం స్పష్టీకరణపై స్పందించాల్సిన అవసరమైతే ఉంది.

First Published:  5 Feb 2020 5:39 AM IST
Next Story