కేజ్రీవాల్ బాటలో జగన్ !
ఢిల్లీ ఎన్నికలు ప్రస్తుతం పొలిటికల్ హీట్ పెంచాయి. సీఎం కేజ్రీవాల్ మళ్లీ అధికారంలోకి వస్తారని పొలిటికల్ పండితులే కాదు… సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇప్పటికే ఆయనకు 45 శాతం ఓట్లు పక్కాగా పడతాయని సర్వేరాయుళ్లు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ చీల్చే ఓట్లు బీజేపీకి కొంత మేరకు లాభం చేకూర్చవచ్చు. కానీ కేజ్రీవాల్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేవు అనేది లేటెస్ట్ సమాచారం. కేజ్రీవాల్ తాను నమ్ముకున్న పథకాలే ఇప్పుడు ఆయనకు ఓట్లు రాలుస్తున్నాయి. ప్రధానంగా బస్తీ దవాఖానాలు, ప్రభుత్వ పాఠశాలల్లో […]
ఢిల్లీ ఎన్నికలు ప్రస్తుతం పొలిటికల్ హీట్ పెంచాయి. సీఎం కేజ్రీవాల్ మళ్లీ అధికారంలోకి వస్తారని పొలిటికల్ పండితులే కాదు… సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇప్పటికే ఆయనకు 45 శాతం ఓట్లు పక్కాగా పడతాయని సర్వేరాయుళ్లు విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్ చీల్చే ఓట్లు బీజేపీకి కొంత మేరకు లాభం చేకూర్చవచ్చు. కానీ కేజ్రీవాల్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేవు అనేది లేటెస్ట్ సమాచారం.
కేజ్రీవాల్ తాను నమ్ముకున్న పథకాలే ఇప్పుడు ఆయనకు ఓట్లు రాలుస్తున్నాయి. ప్రధానంగా బస్తీ దవాఖానాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన నాణ్యమైన విద్యాబోధన, విద్యుత్ రాయితీలు, టైమ్‌కు నల్లా నీళ్లతో పాటు… పలు సంస్కరణలు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాయి. అవి ఇప్పుడు ఆయనకు పాజిటివ్ ఓటును తీసుకొస్తున్నాయి.
సరిగ్గా ఏపీలో కూడా జగన్ ఇదే ఫార్ములాను నమ్ముతున్నారు. తన పథకాలే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో… వచ్చే ఎన్నికల్లో… ఓట్లు రాలుస్తాయని అనుకుంటున్నారు. అమ్మ ఒడి, పిల్లల మధ్యాహ్న భోజనం, ఇంటింటికి పెన్షన్ ఇప్పటివరకూ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ఈ పథకాల లబ్ధిదారులు ఇప్పటికే సంతోషంగా ఉన్నారు. స్కూలు పిల్లల్లో కూడా ఆనందం కనిపిస్తోంది. లంచ్ మెనూ మార్పు వలన పిల్లల అటెండెన్స్ పెరిగింది. అటు ఇంటింటికి ఫించన్ అందడంతో వృద్ధులు సంతోషంగా ఉన్నారు. అమ్మఒడితో మహిళల మనసులను జగన్ చూరగొన్నారు.
ఇప్పుడు జగన్ సర్కార్‌కు ఈ లబ్ధిదారులే ప్రధాన ప్రచారకర్తలుగా మారారు. కేజ్రీవాల్ మోడల్‌లోనే…. జగన్‌కు కూడా ఇవే పథకాలు పాజిటివ్ ఓటును తీసుకువస్తాయని నమ్ముతున్నారట ఆ పార్టీ నాయకులు.