Telugu Global
NEWS

అండర్ -19 ప్రపంచకప్ సెమీస్ లో భారత్ " పాక్ ఫైట్

ఫైనల్లో నువ్వానేనా అంటున్న దాయాదిజట్లు 2020 అండర్ -19 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్స్ కు సౌతాఫ్రికా లోని పోచెఫ్స్ స్ట్ర్రోమ్ లో రంగం సిద్ధమయ్యింది. మరికాసేపట్లో జరిగి నాకౌట్ ఫైట్ లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ కు మాజీ చాంపియన్ పాకిస్థాన్ సవాలు విసురుతోంది. టాప్ గేర్ లో భారత కుర్రాళ్లు… గ్రూప్- ఏ లీగ్ లో మూడుకు మూడుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా టేబుల్ టాపర్ గా క్వార్టర్స్ కు చేరిన భారతజట్టు…క్వార్టర్ ఫైనల్స్ లో గత […]

అండర్ -19 ప్రపంచకప్ సెమీస్ లో భారత్  పాక్ ఫైట్
X
  • ఫైనల్లో నువ్వానేనా అంటున్న దాయాదిజట్లు

2020 అండర్ -19 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్స్ కు సౌతాఫ్రికా లోని పోచెఫ్స్ స్ట్ర్రోమ్ లో రంగం సిద్ధమయ్యింది. మరికాసేపట్లో జరిగి నాకౌట్ ఫైట్ లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ కు మాజీ చాంపియన్ పాకిస్థాన్ సవాలు విసురుతోంది.

టాప్ గేర్ లో భారత కుర్రాళ్లు…

గ్రూప్- ఏ లీగ్ లో మూడుకు మూడుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా టేబుల్ టాపర్ గా క్వార్టర్స్ కు చేరిన భారతజట్టు…క్వార్టర్ ఫైనల్స్ లో గత టోర్నీ రన్నరప్ ఆస్ట్ర్రేలియాను చిత్తు చేయడం ద్వారా సెమీఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

భారత ఓపెనర్ కమ్ ఆల్ రౌండర్ యశస్వి జైస్వాల్ …ఇప్పటి వరకూ ఆడిన నాలుగుమ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా..టాపార్డర్ కే వెన్నెముకగా నిలుస్తూ వస్తున్నాడు.

మరోవైపు బౌలింగ్ లో పేస్ జోడీ ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగీ, స్పిన్ జంట రవి బిష్నోయ్, కన్ కోల్కేర్ సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. కెప్టెన్ ప్రియం గార్గ్, వైస్ కెప్టెన్ జురెల్ సైతం స్థాయికి తగ్గట్టుగా ఆడితే పాక్ ను చిత్తు చేయడం భారత కుర్రాళ్లకు ఏమంత కష్టంకాబోదు.

ఇప్పటికే ఆరుసార్లు ఫైనల్స్ ఆడి …నాలుగుసార్లు ట్రోఫీ అందుకొన్న భారతజట్టే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

మరోవైపు లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకూ నిలకడగా రాణిస్తూ వస్తున్న పాక్ జట్టులో సైతం పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారు.

భారత్ తో పోరు మరో పోటీ మాత్రమే…

భారత్ ప్రత్యర్థిగా పోటీకి దిగడం తమకు మరో మ్యాచ్ మాత్రమేనని, తమపై ఎలాంటి ఒత్తిడిలేదని పాక్ కెప్టెన్ ధీమాగా చెబుతున్నాడు.

బెనోనీ వేదికగా ముగిసిన ఆఖరి క్వార్టర్ ఫైనల్లో చిచ్చర పిడుగు అప్ఘనిస్థాన్ పై సాధించిన విజయంతో పాకిస్థాన్ కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు పెరిగింది.

లోస్కోరింగ్ పోరుగా సాగిన ఈ పోటీలో పాక్ 6 వికెట్ల విజయంతో సెమీస్ లో చోటు ఖాయం చేసుకోగలిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన అప్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 189 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగింది. సమాధానంగా190 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాక్ జట్టుకు… ఓపెనర్ మహ్మద్ హురైరా స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా విజయం అందించాడు.

ఫిబ్రవరి 6న రెండో సెమీస్ …

పోచెఫ్స్ స్ట్రోమ్ వేదికగా ముగిసిన మూడో క్వార్టర్ ఫైనల్లో …ఆతిథ్య సౌతాఫ్రికాను బంగ్లాదేశ్ 107 పరుగులతో చిత్తు చేసి సెమీస్ సమరానికి అర్హత సంపాదించిందిఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్… ఓపెనర్ల హాఫ్ సెంచరీలజోరుతో…50 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగుల స్కోరు సాధించింది. సమాధానంగా సౌతాఫ్రికా 42.3 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది.

ఫిబ్రవరి 6న జరిగే రెండోసెమీఫైనల్లో న్యూజిలాండ్ తో బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రపంచకప్ సెమీస్ చేరిన మొత్తం నాలుగుజట్లలో మూడు…ఆసియాదేశాల జట్ల కావడం విశేషం.

First Published:  4 Feb 2020 2:00 AM IST
Next Story