రోహిత్ శర్మకు మరో గాయం
కివీస్ తో వన్డే, టెస్ట్ సిరీస్ లకు దూరం న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే, రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ కు గట్టిదెబ్బ తగిలింది. వన్డేల్లో వైస్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ.. కాలిపిక్క గాయంతో జట్టుకు దూరమయ్యాడు. న్యూజిలాండ్ గడ్డపై భారతజట్టు …తొలిసారిగా టీ-20 సిరీస్ నెగ్గడంలో రోహిత్ శర్మ ఓపెనర్ గా ప్రధానపాత్ర వహించాడు. అక్లాండ్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో.. వరుస సిక్సర్లతో సూపర్ ఓవర్ విజయం అందించిన రోహిత్ […]
- కివీస్ తో వన్డే, టెస్ట్ సిరీస్ లకు దూరం
న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే, రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ కు గట్టిదెబ్బ తగిలింది. వన్డేల్లో వైస్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ.. కాలిపిక్క గాయంతో జట్టుకు దూరమయ్యాడు.
న్యూజిలాండ్ గడ్డపై భారతజట్టు …తొలిసారిగా టీ-20 సిరీస్ నెగ్గడంలో రోహిత్ శర్మ ఓపెనర్ గా ప్రధానపాత్ర వహించాడు. అక్లాండ్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో.. వరుస సిక్సర్లతో సూపర్ ఓవర్ విజయం అందించిన రోహిత్ శర్మ…బే ఓవల్ వేదికగా ముగిసిన ఆఖరి టీ-20లో సైతం స్టాండ్ ఇన్ కెప్టెన్ గా హాఫ్ సెంచరీతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.
సిరీస్ లోని ఆఖరి టీ-20లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ కాలిపిక్కకు గాయమయ్యింది. అప్పటికే టీ-20ల్లో 29వ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్.. భరించలేని నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత ఆట నుంచి ఉపసంహరించుకొన్నాడు.
గాయం నుంచి రోహిత్ కోలుకోడానికి రెండు లేదా మూడువారాల సమయం పట్టే అవకాశం ఉండడంతో…న్యూజిలాండ్ తో జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ తో పాటు.. రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు సైతం అందుబాటులో ఉండబోడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
గతంలో భుజం గాయంతో శస్త్రచికిత్స కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ కెరియర్ లో ఇది రెండో అతిపెద్ద గాయంగా నిలిచింది. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ.. ఓపెనర్ గా రాణిస్తున్న భారత్ కు ఇది గట్టి దెబ్బే కానుంది.
కీలక ఆటగాళ్లు శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హార్థిక్ పాండ్యా పలు రకాల గాయాలతో ఇప్పటికే జట్టుకు దూరమైన నేపథ్యంలో రోహిత్ కూడా గాయం బారిన పడటాన్ని టీమ్ మేనేజ్ మెంట్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.