రాజ్యాంగ సంరక్షణకు సిద్ధమైన ప్రజలు
భారత రాజ్యాంగం నియంత్రణా వ్యవస్థగా ఉంటుందన్న భావన ఉండేది. ముఖ్యంగా 1950 జనవరి 26న ఈ విషిష్టతను గుర్తించారు. గణతంత్ర దినొత్సవం రోజున విజయపథ్ లో జరిగే త్రివిధ దళాల కవాతు, నైపుణ్యం, మన ఆయుధ సంపత్తి ప్రదర్శన చూస్తే సైనిక బలగాలు మనలను విదేశీ దాడి నుంచి కాపాడగలుగుతాయన్న నమ్మకం కుదిరేది. రాజ్యాంగ సూత్రాలు మనలో కొందరికి అంత విషిష్టమైనవిగా కనిపించకపోవచ్చు. అంతమాత్రం చేత మనకు రాజ్యాంగంతో సంబంధం లేదని కాదు. మన రాజ్యాంగ విశిష్టతను […]
భారత రాజ్యాంగం నియంత్రణా వ్యవస్థగా ఉంటుందన్న భావన ఉండేది. ముఖ్యంగా 1950 జనవరి 26న ఈ విషిష్టతను గుర్తించారు. గణతంత్ర దినొత్సవం రోజున విజయపథ్ లో జరిగే త్రివిధ దళాల కవాతు, నైపుణ్యం, మన ఆయుధ సంపత్తి ప్రదర్శన చూస్తే సైనిక బలగాలు మనలను విదేశీ దాడి నుంచి కాపాడగలుగుతాయన్న నమ్మకం కుదిరేది.
రాజ్యాంగ సూత్రాలు మనలో కొందరికి అంత విషిష్టమైనవిగా కనిపించకపోవచ్చు. అంతమాత్రం చేత మనకు రాజ్యాంగంతో సంబంధం లేదని కాదు. మన రాజ్యాంగ విశిష్టతను గురించి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో గుర్తు చేస్తూనే ఉంటారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగం ప్రస్తావన ఉండనే ఉంటుంది.
వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారుల విషయంలోనూ రాజ్యాంగ ప్రస్తావన కనిపిస్తూనే ఉంటుంది. అవసరమైనప్పుడు ఈ ప్రమాణాలు చేయిస్తుంటారు. అయితే ప్రమాణం స్వీకరించడం ద్వారా మంత్రులు, ఇతరులు ప్రమాణం స్వీకరించడం వ్యక్తిగత స్థాయిలో, న్యాయ సంబంధమైందిగా ఉండవచ్చు.
ఈ నేపథ్యంలోంచి చూస్తే వివిధ నిరసన ప్రదర్శనల సందర్భంగా ప్రజలు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం కనిపిస్తోంది. ఇలా ప్రమాణం స్వీకరించడం ద్వారా ప్రజలు రాజ్యాంగ సూత్రాలకు తాము నిబద్ధులమై ఉన్నామని చెప్తున్నారు. దేశంలోని ప్రజాస్వామ్య సూత్రాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ వ్యవస్థలు విఫలం అవుతున్న తీరును కూడా ప్రజలు స్వీకరించే ఈ ప్రమాణాలు గుర్తు చేస్తున్నాయి. మీరు రాజ్యాంగ సూత్రాలను, నిబంధనలను సవ్యంగా పాటించడం లేదా అని ప్రభుత్వ అధికార ప్రతినిధులను ప్రశ్నిస్తే వారు సూటిగా సమాధానం చెప్పరు. పైగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని తాము ప్రమాణం చేశామని మాత్రం చెప్తారు.
ప్రమాణం స్వీకరించడం అంటే రాజ్యాంగ ఆదేశాలను పాటిస్తామని, తదనుగుణంగా నడుచుకుంటామని ప్రతిన బూనడం. ఇలా ప్రమాణం స్వీకరించడం వ్యవస్థల ఆవరణ నుంచి దేశంలోని వివిధ నగరాల్లో వీధుల్లోనే జరుగుతోంది. బహిరంగంగా ప్రమాణం స్వీకరించడం మూడు నైతిక అంశాలను వ్యక్తం చేస్తోంది. మొదటిది ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించే వారు సంపూర్ణమైన చిత్త శుద్ధితో తమ విధులు నిర్వర్తించవలసిన బాధ్యతను గుర్తు చేయడం.
రాజ్యాంగం మీద ప్రమాణం చేయడమంటే ఈ నైతిక బాధ్యతను గుర్తు చేయడమే. రెండవది, బహిరంగంగా ఇలాంటి ప్రమాణ స్వీకారం ద్వారా ఎవరూ చొరవ తీసుకోక పోయినా మతాలతో నిమిత్తం లేకుండా అందరికీ పౌరసత్వం ఉండాలన్న వాస్తవాన్ని తెలియజెప్పడం. మూడవది, ఇలా మూకుమ్మడిగా ప్రమాణం చేయడంవల్ల వివిధ సమాజాలు రాజ్యాంగానికి నిబద్ధమై ఉండాలన్న సందేశం కూడా ఉంది. ఈ ప్రమాణాలు ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంచడానికి ఉపకరిస్తాయి.
“రాజ్యాంగానికి నిబద్ధమైన సమూహాల”ను ఏర్పాటు చేయడంద్వారా రాజ్యాంగానికి మరింత దృఢంగా కట్టుబడి ఉంటామని గట్టిగా చెప్తున్నట్టుగా భావించవచ్చు. ఈ ప్రమాణాన్ని ఉల్లంఘించడం కుటిలత్వం అని స్పష్టం చేసినట్టు కూడా అవుతుంది. అయితే ప్రమాణాలు చేసిన తరవాత కూడా కుటిలత్వం ప్రదర్శించే వారు ఉండొచ్చు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం అంటే ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం. బహిరంగంగా ప్రజలు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న తీరు చూస్తే రాజ్యాంగం మీద ఉన్న ఆకాంక్షలు వ్యక్తం చేసినట్టే. నిరసన తెలియజేస్తున్న వారికి ఇది ఒక భరోస ఇస్తుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం అంటే రాజ్యాంగం మీద భరోసా వ్యక్తం చేయడమే. అందువల్ల ప్రజలు బహిరంగంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం కేవలం న్యాయ సంబంధమైన వ్యవహారానికి పరిమితం కాదు.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)