పవన్ కు లోక్ సత్తా జేపీ అనూహ్య మద్దతు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ… అనూహ్య మద్దతు తెలిపారు. పవన్ తీరుపై… కీలక నాయకుడుగా ఉన్న మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ విమర్శలు చేస్తూ.. రాజీనామా చేసిన అనంతరం.. జేపీ స్పందించారు. రాజకీయాలు మాత్రమే చేస్తానని చెప్పిన పవన్.. మళ్లీ సినిమాలు చేయడాన్ని లక్ష్మీనారాయణ విమర్శించడంపై.. జేపీ మరో రకంగా స్పందించారు. రాజకీయాల పరంగా కాకుండా.. పవన్ వ్యక్తిగత నిర్ణయంపైనే జేపీ స్పందించారు. సినిమాల వరకే… తన నిర్ణయాన్ని పరిమితం […]
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ… అనూహ్య మద్దతు తెలిపారు. పవన్ తీరుపై… కీలక నాయకుడుగా ఉన్న మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ విమర్శలు చేస్తూ.. రాజీనామా చేసిన అనంతరం.. జేపీ స్పందించారు. రాజకీయాలు మాత్రమే చేస్తానని చెప్పిన పవన్.. మళ్లీ సినిమాలు చేయడాన్ని లక్ష్మీనారాయణ విమర్శించడంపై.. జేపీ మరో రకంగా స్పందించారు. రాజకీయాల పరంగా కాకుండా.. పవన్ వ్యక్తిగత నిర్ణయంపైనే జేపీ స్పందించారు. సినిమాల వరకే… తన నిర్ణయాన్ని పరిమితం చేసి మాట్లాడారు.
సినిమా ఇమేజ్ ఉన్న పవన్ కల్యాణ్.. తన పార్టీని కాపాడుకోవడానికి, తనను నమ్ముకున్న వారిని పోషించుకోవడానికి మళ్లీ సినిమాలు చేయడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. సజావుగా సొమ్ము సంపాదిస్తానంటే.. తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. నిజాయితీగా పని చేసి సంపాదిస్తున్నప్పుడు ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఓవరాల్ గా చూస్తే.. సినిమాల్లో పవన్ రీ ఎంట్రీని జేపీ స్వాగతించేశారు.
జేపీ తీరునే.. టీడీపీ నేతలు కూడా అనుసరిస్తున్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి నేతలు కూడా రాజకీయాల్లోకి వచ్చాక నటించిన సందర్భాలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటప్పుడు పవన్ మళ్లీ సినిమాల్లో నటిస్తే తప్పేంటని ఆయన అంటున్నారు. మొత్తంగా.. ఎటు చూసినా.. లక్ష్మీ నారాయణే ఈ విషయంలో టార్గెట్ అవుతున్నారు. జనసేన వీడుతూ చేసిన కామెంట్లతో ఆయన ఈ పరిస్థితి కొనితెచ్చుకున్నారు.
తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, గనుల వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాలు ఏవీ లేవంటూ.. తనను నమ్ముకున్న జనాలను, పార్టీని కాపాడుకునేందుకే సినిమాలు చేస్తున్నానని.. లక్ష్మీనారాయణకు పవన్ ఇచ్చిన సమాధానమే.. ఇంత చర్చకు దారి తీసింది.