ఏపీలో మరో కలకలం.... అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు
ఇప్పటికే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి పై కొరడా ఝళిపించిన ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు తాజాగా ప్రభుత్వ అధికారులుగా ఉంటూ లంచాలతో కోట్లు కూడబెట్టిన అవినీతి తిమింగళాలపై పడ్డారు. మంగళవారం ఏపీ వ్యాప్తంగా కొందరు అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వందల కోట్ల ఆస్తులు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ప్రభుత్వ అధికారులపై మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అవినీతి అధికారుల నివాసాలతోపాటు వారి బంధువుల ఇళ్లు, […]
ఇప్పటికే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి పై కొరడా ఝళిపించిన ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు తాజాగా ప్రభుత్వ అధికారులుగా ఉంటూ లంచాలతో కోట్లు కూడబెట్టిన అవినీతి తిమింగళాలపై పడ్డారు.
మంగళవారం ఏపీ వ్యాప్తంగా కొందరు అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వందల కోట్ల ఆస్తులు వెలుగుచూస్తున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ప్రభుత్వ అధికారులపై మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అవినీతి అధికారుల నివాసాలతోపాటు వారి బంధువుల ఇళ్లు, బినామీల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. 25 ఏసీబీ బృందాలు దాడులు జరుపుతున్నారు. భారీగా ఆస్తులు, నగలు, నగదు గుర్తించారు.
ఏపీలో దాడులు జరుగుతున్నది వీరిపైనే…
- శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం ఐటిడిఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ టి. మోహన్ రావు
- విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, సూపరిటెండెంట్ శ్రీ గంధం వెంకట పల్లం రాజు
- విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామ పి.ఎ.సిఎస్ స్టాఫ్ అసిస్టెంట్ శ్రీ సీరం రెడ్డి గోవిందు
- తూర్పు గోదావరి జిల్లా సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, (కాకినాడ) శ్రీ లంకె రఘు బాబు
- కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్, పి.ఎ. టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీ సాకే సత్యం
ఈ అధికారులపై ఏసీబీ దాడులతో అవినీతికి అలవాటుపడ్డ ప్రభుత్వ అధికారులు కలవర పడుతున్నారు.