మున్సిపల్ ఫలితాలు రేపిన చిచ్చు... తెలంగాణ కమలంలో గ్రూపుల కొట్లాట !
మున్సిపల్ ఫలితాలు తెలంగాణ కమలంలో గ్రూపుల ఫైట్‌కు తెరలేపాయి. రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాల్టీల్లో కొన్ని మున్సిపాల్టీల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు దొరకలేదు. అయితే 70 నుంచి 80 మున్సిపాల్టీల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడివరకూ కొంతవరకూ ఫర్వాలేదు. కానీ గెలిచే సీట్లు కూడా గ్రూపుల గోలతో ఓడిపోయారనేది ఇప్పుడు విన్పిస్తున్న ప్రధాన ఆరోపణ. కరీంనగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్నికలకు ముందే రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ఇవి బీజేపీకి పట్టున్న […]
మున్సిపల్ ఫలితాలు తెలంగాణ కమలంలో గ్రూపుల ఫైట్‌కు తెరలేపాయి. రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాల్టీల్లో కొన్ని మున్సిపాల్టీల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు దొరకలేదు. అయితే 70 నుంచి 80 మున్సిపాల్టీల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడివరకూ కొంతవరకూ ఫర్వాలేదు. కానీ గెలిచే సీట్లు కూడా గ్రూపుల గోలతో ఓడిపోయారనేది ఇప్పుడు విన్పిస్తున్న ప్రధాన ఆరోపణ.
కరీంనగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్నికలకు ముందే రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ఇవి బీజేపీకి పట్టున్న ప్రాంతాలు. ఈ రెండు డివిజన్లు ఎలా ఏకగ్రీవం అయ్యాయో…బీజేపీ అభ్యర్థులు ఇక్కడ ఎందుకు విత్ డ్రా అయ్యారో తెలియాలి అని బీజేపీలోని ఓవర్గం తీవ్రంగా పట్టుబడుతోంది.
మరోవైపు కరీంనగర్ బీజేపీ కేవలం 13 డివిజన్లు మాత్రమే గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ గాలి ఏమాత్రం లేదు. టీఆర్ఎస్,బీజేపీ మధ్య పైట్ జరిగింది. నిఘావర్గాలు 25 నుంచి 28 సీట్లలో బీజేపీ గెలుస్తుందని అంచనా వేసింది. తీరా పలితాలు చూస్తే 13 దగ్గరే ఆగింది. 200 లోపు ఓట్ల తేడాతో 12 డివిజన్లు కోల్పోయింది. దీనికి కారణం సరైన అభ్యర్థులను బరిలో నిలపకపోవడమే కారణమని తెలుస్తోంది.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారట. ఆయన అనుచరులకే టిక్కెట్లు దక్కాయట. సీనియర్ నేతలు గుజ్జ సతీష్‌తో పాటు ఇతర నేతలకు కూడా టిక్కెట్లు రాలేదట. దీంతో గెలిచే స్థానాలు బీజేపీ కోల్పోవాల్సి వచ్చిందనేది సంజయ్ వ్యతిరేకుల వాదన.
మరోవైపు నిజామాబాద్‌లో కూడా యెండెల లక్ష్మీనారాయణ, అర్వింద్ వర్గాల మధ్య టికెట్లు చిచ్చు చివరి వరకూ నడిచింది. ఓ దశలో టికెట్ల పంచాయతీకి విసిగిపోయిన అర్వింద్ ఒకరోజు ఇంట్లోనుంచి బయటకు రాలేదట. చివరకు డీఎస్ నచ్చజెప్పి…టికెట్ల పంచాయతీని ఓ కొలిక్కి తెచ్చారట. డీఎస్ జోక్యంతో అక్కడ పార్టీ 28 సీట్లు గెలిచిందట.
ఇక్కడే కాదు. మిగిలిన చోట్ల కూడా గ్రూపుల గోలతో సరైన అభ్యర్థులకు టికెట్లు దక్కలేదనేది బీజేపీలో నేతల ఆరోపణ. కొత్తగా ఎదుగుతున్న నాయకత్వం, పాత తరం నేతల మధ్య ఫైట్ నడుస్తోందట. ఇది పార్టీకి తీవ్రంగా నష్టం కలుగజేస్తుందని ఆ పార్టీ నాయకులు కొందరు వాపోతున్నారట.