Telugu Global
National

కేజ్రీవాల్ వైపే ఢిల్లీ ఓటర్ల మొగ్గు.... పీపుల్స్ పల్స్ సర్వే

హైదరాబాద్ కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ అనే సర్వే సంస్థ తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ పలు సర్వేలు చేసింది. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఈనెల 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. దేశ రాజధాని రాష్ట్రంలో బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సై అంటే సై […]

కేజ్రీవాల్ వైపే ఢిల్లీ ఓటర్ల మొగ్గు.... పీపుల్స్ పల్స్ సర్వే
X

హైదరాబాద్ కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ అనే సర్వే సంస్థ తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ పలు సర్వేలు చేసింది. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు అందరినీ షాక్ కు గురిచేశాయి.

ఈనెల 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. దేశ రాజధాని రాష్ట్రంలో బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సై అంటే సై అంటున్నాయి. దీంతో ఇక్కడ ఫలితం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.ఓడిపోతే పరువు పోతుంది కాబట్టి బీజేపీ అగ్ర నేతలంతా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ‘పీపుల్స్ పల్స్’ సంస్థ చేసిన సర్వేలో ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధిస్తుందని సర్వే నిగ్గుతేల్చింది. సర్వేలో ఓటర్లంతా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన వినూత్న పథకాల పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని సర్వేలో పేర్కొన్నారు.

ఆమ్ఆద్మీ పార్టీని ఢిల్లీ ఎన్నికల్లో గెలవకుండా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. సీఏఏ, ఎన్నార్సీలపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు బీజేపీకి శాపంగా మారాయి. కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో తీసికట్టుగా మారింది. మాజీ సీఎం షీలా దీక్షిత్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అస్సలు కోలుకోవడం లేదు. మూడు సార్లు సీఎంగా షీలా ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ ను నిలిపారు. ఇప్పుడా పార్టీ ఢిల్లీలో ఉనికి చాటుకునే పరిస్థితిలో కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికీ కాంగ్రెస్ కు ఢిల్లీలో బలమైన నాయకులు లేరు.

ఇక బీజేపీ ప్రకటించిన ఢిల్లీ సీఎం అభ్యర్థి కొత్త వ్యక్తి. దీంతో ఆ పార్టీపై కూడా సానుకూలత లేదని సర్వే తేల్చింది. అంతిమంగా కేజ్రీవాల్ ఇమేజ్ ఢిల్లీలో బాగా ఉందని.. ఆయనకు సరితూగే సీఎం అభ్యర్థి, గట్టి క్యాండిడేట్ ఢిల్లీ ఎన్నికల్లో లేరని సర్వేతేల్చింది. ఆమ్ ఆద్మీదే విజయం అని స్పష్టం చేసింది.

First Published:  3 Feb 2020 6:53 AM IST
Next Story