నారావారి పల్లెలో ‘వికేంద్రీకరణ’ సదస్సుకు భారీ జన సందోహం
ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వగ్రామం.. చిత్తూరు జిల్లా నారావారి పల్లె.. వైసీపీ సభకు ఆదివారం వేదికైంది. వేలాది మంది హాజరైన ఈ సభలో.. పాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడారు. టీడీపీకి కంచుకోట అయిన ఈ ప్రాంతంలో ఇంత భారీగా జనాలు వస్తారని ఎవరూ ఊహించలేదు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారు. అమరావతికి పోటీగా.. వైసీపీ నాయకులు చేస్తున్న వికేంద్రీకరణ పోరాటంలో భాగంగా నిర్వహించిన ఈ సభకు.. అనూహ్య […]
ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వగ్రామం.. చిత్తూరు జిల్లా నారావారి పల్లె.. వైసీపీ సభకు ఆదివారం వేదికైంది. వేలాది మంది హాజరైన ఈ సభలో.. పాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడారు. టీడీపీకి కంచుకోట అయిన ఈ ప్రాంతంలో ఇంత భారీగా జనాలు వస్తారని ఎవరూ ఊహించలేదు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారు.
అమరావతికి పోటీగా.. వైసీపీ నాయకులు చేస్తున్న వికేంద్రీకరణ పోరాటంలో భాగంగా నిర్వహించిన ఈ సభకు.. అనూహ్య ఏర్పాట్లు చేశారు. దాదాపు 25 వేల మంది ప్రజలు సభకు హాజరయ్యారు. సమీపంలోని 15 గ్రామాల ప్రజలు వక్తల ప్రసంగాలు వినేలా.. సభ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మైక్ సెట్లు అమర్చారు. కాలూరు క్రాస్, శ్రీనివాస మంగాపురం, నరసింగాపురం క్రాస్, రంగంపేట నుంచి నారావారి పల్లె వరకూ…. వికేంద్రీకరణ ఉద్దేశాలు వివరిస్తూ…. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరై…. ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ప్రజలతో తమ ఆలోచనలు పంచుకున్నారు. ఇంత స్థాయిలో ప్రజలు హాజరవడం.. అది కూడా నారావారి పల్లె లాంటి చోట విజయవంతంగా సభ నిర్వహించడం.. రాజకీయ వర్గాలను కూడా ఆకర్షించింది.
సభ నిర్వహణకు ముందు కాస్త ఉద్రిక్తత తలెత్తినా.. చివరికి పోలీసు యంత్రాగం చర్యలతో అంతా ప్రశాంతంగా పూర్తయింది. సభ కూడా విజయవంతం అయ్యింది.