Telugu Global
National

ఏపీలో మరో గిరిజన ఫ్రీడం ఫైటర్స్‌ మ్యూజియం

ఆంధ్రప్రదేశ్‌లో మరో గిరిజన మ్యూజియంను నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియాన్ని నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… విశాఖ జిల్లా పాడేరు పరిధిలోని కె.డీ.పేట లో మరో గిరిజన ఫ్రీడం ఫైటర్స్‌ మ్యూజియాన్ని నిర్మించబోతోంది. స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజుతో పాటు అశువులు బాసిన మల్లు దొర, గంటం దొర వంటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఈ మ్యూజియంలో నెలకొల్పబోతున్నారు. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో […]

ఏపీలో మరో గిరిజన ఫ్రీడం ఫైటర్స్‌ మ్యూజియం
X

ఆంధ్రప్రదేశ్‌లో మరో గిరిజన మ్యూజియంను నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియాన్ని నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… విశాఖ జిల్లా పాడేరు పరిధిలోని కె.డీ.పేట లో మరో గిరిజన ఫ్రీడం ఫైటర్స్‌ మ్యూజియాన్ని నిర్మించబోతోంది.

స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజుతో పాటు అశువులు బాసిన మల్లు దొర, గంటం దొర వంటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఈ మ్యూజియంలో నెలకొల్పబోతున్నారు. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మ్యూజియంను నిర్మించనున్నారు.

300 మంది వీక్షించే విధంగా ఒక ఆంఫీ థియేటర్‌ను, హోలో గ్రాఫిక్‌ షో కోసం ఒక ప్రత్యేక నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ మ్యూజియంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా గిరిజనుల పోరాట వివరాలు, గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్క్రృతి సంప్రదాయాలకు సంబంధించిన వివిధ అంశాలను అక్కడ ఏర్పాటు చేస్తారు.

First Published:  3 Feb 2020 11:10 AM IST
Next Story