Telugu Global
National

మోడీ భద్రతకు 600 కోట్లా?

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశాన్ని ఆర్థిక మాంద్యం చుట్టేసింది. ఉద్యోగ, ఉపాధి లేక వందలాది మంది రోడ్డున పడుతున్నారు. ఆటోమొబైల్ సహా పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రగతి చక్రాన్ని పట్టాలెక్కించాల్సిన బడ్జెట్ నిరాశను కలిగించిందని అందరూ ఆడిపోసుకుంటున్నారు. మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి స్టాక్ మార్కెట్ 1000 పాయింట్లు కుప్పకూలింది. ఇలా దేశాన్ని కమ్ముకున్న ఆర్థిక మాంద్యాన్ని పక్కనపెట్టి మోడీ తన సొంత అవసరాలకు […]

మోడీ భద్రతకు 600 కోట్లా?
X

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశాన్ని ఆర్థిక మాంద్యం చుట్టేసింది. ఉద్యోగ, ఉపాధి లేక వందలాది మంది రోడ్డున పడుతున్నారు. ఆటోమొబైల్ సహా పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రగతి చక్రాన్ని పట్టాలెక్కించాల్సిన బడ్జెట్ నిరాశను కలిగించిందని అందరూ ఆడిపోసుకుంటున్నారు.

మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి స్టాక్ మార్కెట్ 1000 పాయింట్లు కుప్పకూలింది. ఇలా దేశాన్ని కమ్ముకున్న ఆర్థిక మాంద్యాన్ని పక్కనపెట్టి మోడీ తన సొంత అవసరాలకు కోట్ల బడ్జెట్ పెట్టుకోవడం వివాదాస్పదమైంది.

తాజాగా కేంద్ర బడ్జెట్ లో మోడీ భద్రత కోసం ఏకంగా 600 కోట్లను కేటాయించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన స్వామి భక్తిని చాటుకున్నారు.

దేశంలో ఇప్పుడు సోనియా, రాహుల్, మన్మోహన్ సహా అందరికీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రతను తీసేశారు. ఇప్పుడు దేశంలోనే అత్యంత భద్రతను ఇచ్చే ఎస్పీజీ భద్రత కేవలం ప్రధాని మోడీకే దక్కుతోంది.

తాజాగా ప్రధాని ఎస్పీజీ భద్రత కోసం ఏకంగా 600 కోట్లు కేటాయించడం దుమారం రేపింది. గత ఏడాది కూడా ఏకంగా 540 కోట్లు కేటాయించారు. ఇలా సామాన్యుడికి ఊరటనివ్వని బడ్జెట్ ప్రధాని మోడీ వ్యక్తిగత భద్రతకు మాత్రం వందల కోట్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

First Published:  2 Feb 2020 1:25 AM GMT
Next Story