Telugu Global
NEWS

జూనియర్ ప్రపంచకప్ సెమీస్ లో భారత్ తో పాక్ ఢీ

బంగ్లాదేశ్ కు న్యూజిలాండ్ సవాల్ సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ -19 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. క్వార్టర్ ఫైనల్స్ లో విజయాలు సాధించిన మొత్తం నాలుగు జట్లలో మూడుజట్లు ఆసియా దేశాలే కావడం విశేషం. ఢిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి. అప్ఘన్ కు పాకిస్థాన్ బ్రేక్…. బెనోనీ వేదికగా ముగిసిన ఆఖరి క్వార్టర్ ఫైనల్లో చిచ్చర పిడుగు అప్ఘనిస్థాన్ సంచలన […]

జూనియర్ ప్రపంచకప్ సెమీస్ లో భారత్ తో పాక్ ఢీ
X
  • బంగ్లాదేశ్ కు న్యూజిలాండ్ సవాల్

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ -19 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. క్వార్టర్ ఫైనల్స్ లో విజయాలు సాధించిన మొత్తం నాలుగు జట్లలో మూడుజట్లు ఆసియా దేశాలే కావడం విశేషం.

ఢిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి.

అప్ఘన్ కు పాకిస్థాన్ బ్రేక్….

బెనోనీ వేదికగా ముగిసిన ఆఖరి క్వార్టర్ ఫైనల్లో చిచ్చర పిడుగు అప్ఘనిస్థాన్ సంచలన విజయాలకు మాజీ చాంపియన్ పాకిస్థాన్ తెరదించింది. లోస్కోరింగ్ పోరుగా సాగిన ఈ పోటీలో పాక్ 6 వికెట్ల విజయంతో సెమీస్ లో చోటు ఖాయం చేసుకోగలిగింది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన అప్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 189 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగింది. సమాధానంగా190 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాక్ జట్టుకు…ఓపెనర్ మహ్మద్ హురైరా స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా విజయం అందించాడు.

పోచెఫ్స్ స్ట్ర్రోమ్ వేదికగా ఫిబ్రవరి 4న జరిగే సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ భారత్ తో పాక్ జట్టు తలపడనుంది.

బంగ్లాదేశ్ భారీగెలుపు..

పోచెఫ్స్ స్ట్రోమ్ వేదికగా ముగిసిన మూడో క్వార్టర్ ఫైనల్లో …ఆతిథ్య సౌతాఫ్రికాను బంగ్లాదేశ్ 107 పరుగులతో చిత్తు చేసి సెమీస్ సమరానికి అర్హత సంపాదించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్… ఓపెనర్ల హాఫ్ సెంచరీలజోరుతో… 50 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగుల స్కోరు సాధించింది. సమాధానంగా సౌతాఫ్రికా 42.3 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది.

ఫిబ్రవరి 6న జరిగే రెండోసెమీఫైనల్లో న్యూజిలాండ్ తో బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనుంది. జూనియర్ ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికే నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత్ మరోసారి ప్రపంచ టైటిల్ సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

First Published:  1 Feb 2020 1:32 AM IST
Next Story