తరలింపు మొదలైంది... కర్నూలు దశ మారుతోంది
న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేసిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే.. హై కోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తామని ప్రకటించింది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి.. అమరావతికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసే పనికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంది. తాజాగా.. విజిలెన్సు కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను.. కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం […]
న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేసిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే.. హై కోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తామని ప్రకటించింది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి.. అమరావతికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసే పనికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంది.
తాజాగా.. విజిలెన్సు కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను.. కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన కారణాల రీత్యానే.. వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు అనువైన భవనాలు గుర్తించాలంటూ కర్నూలు కలెక్టర్, రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ను.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు.
విపక్షాల అభ్యంతరాలకు ఎప్పటికప్పుడు సమాధానాలిస్తూ.. పాలన వికేంద్రీకరణపై ముందుకే వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు దిశగానే.. కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇందుకు కొనసాగింపుగా.. త్వరలో విశాఖలోనూ కీలక కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా.. అధికారులు కూడా కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకుంటున్నారు.
తాజా మార్పులతో కర్నూలు దశ మారుతోందని.. మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. కాస్త పెద్ద వాళ్లయితే.. కర్నూలును రాజధానిగా ఉన్న రోజులు గుర్తు చేసుకుంటున్నారు.