జేడీ లక్ష్మీ నారాయణ కు క్లాస్ పీకిన జయప్రకాష్ నారాయణ
జనసేన నుంచి వైదొలగడానికి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చెప్పిన కారణంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలే చేస్తానన్న పవన్ మళ్లీ సినిమాలు చేయడాన్ని తప్పు పడుతూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్ చెప్పడాన్ని ఇటీవలే టీడీపీ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా జేడీ లక్ష్మీనారాయణను లోక్ సత్తా అధినేత ఆయన తోటి బ్యూరోక్రాట్ జయప్రకాష్ నారాయణ కూడా తప్పు పట్టడం విశేషం. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని జేపీ పూర్తిగా సమర్థించారు. పవన్ […]
జనసేన నుంచి వైదొలగడానికి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చెప్పిన కారణంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలే చేస్తానన్న పవన్ మళ్లీ సినిమాలు చేయడాన్ని తప్పు పడుతూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్ చెప్పడాన్ని ఇటీవలే టీడీపీ తప్పుపట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా జేడీ లక్ష్మీనారాయణను లోక్ సత్తా అధినేత ఆయన తోటి బ్యూరోక్రాట్ జయప్రకాష్ నారాయణ కూడా తప్పు పట్టడం విశేషం. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని జేపీ పూర్తిగా సమర్థించారు.
పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు అని… రాజకీయాలను అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదించకుండా న్యాయబద్దంగా సినిమాలు చేసుకొని సంపాదిస్తే తప్పేంటని జయప్రకాష్ నారాయణ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ నాయకులు అందరూ ఇలా న్యాయబద్దంగా సంపాదిస్తే క్లీన్ పాలిటిక్స్ ఉంటాయని జేపీ పేర్కొన్నారు.
కుటుంబాన్ని, తనను నమ్ముకొని ఉన్న వారి కోసం న్యాయంగా సంపాదించడం వ్యక్తి ప్రాథమిక బాధ్యత అని.. వక్రమార్గాలకు వెళ్లకుండా సినిమాల్లో సంపాదించాలని పవన్ నిర్ణయించుకోవడాన్ని అభినందించాల్సింది పోయి… విమర్శించడం ఏంటని జేడీ లక్ష్మీనారాయణను జయప్రకాష్ నారాయణ తప్పుపట్టారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినా ఎలాంటి వ్యాపారాలు, దందాలు, రాజకీయంతో ఆదాయం సంపాదించకుండా సినిమాలు చేస్తూ సంపాదిస్తానని చెప్పడం తప్పెలా అవుతుందని జేపీ సపోర్ట్ చేశారు. అసలు పవన్ ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని జేపీ స్పష్టం చేశారు.