Telugu Global
NEWS

భారత్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ విన్

న్యూజిలాండ్ పై భారత్ 4-0 ఆధిక్యం భారత్- న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు విజయపరంపర కొనసాగుతోంది. వేదిక మారినా, కెప్టెన్ ను మార్చినా ఆతిథ్య న్యూజిలాండ్ తలరాత ఏమాత్రం మారలేదు. వెలింగ్టన్ వెస్ట్ ప్యాక్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ-20లో సైతం నెగ్గాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పరాజయం చవిచూసింది. నిర్ణిత 20 ఓవర్లలో…రెండుజట్లూ 165 పరుగుల స్కోర్లే సాధించాయి. ఆఖరి రెండుఓవర్లలో విజయానికి 11 పరుగులు […]

భారత్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ విన్
X
  • న్యూజిలాండ్ పై భారత్ 4-0 ఆధిక్యం

భారత్- న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు విజయపరంపర కొనసాగుతోంది. వేదిక మారినా, కెప్టెన్ ను మార్చినా ఆతిథ్య న్యూజిలాండ్ తలరాత ఏమాత్రం మారలేదు.

వెలింగ్టన్ వెస్ట్ ప్యాక్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ-20లో సైతం నెగ్గాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పరాజయం చవిచూసింది. నిర్ణిత 20 ఓవర్లలో…రెండుజట్లూ 165 పరుగుల స్కోర్లే సాధించాయి.

ఆఖరి రెండుఓవర్లలో విజయానికి 11 పరుగులు మాత్రమే సాధించాల్సిన న్యూజిలాండ్ ను భారత్ కట్టడి చేయడం ద్వారా మ్యాచ్ ను టైగా ముగించగలిగింది.

దీంతో ప్రస్తుత సిరీస్ లో వరుసగా రెండోమ్యాచ్ సైతం సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 13 పరుగులు మాత్రమే సాధించింది.

సమాధానంగా సంజు శాంసన్- రాహుల్ లతో చేజింగ్ కు దిగిన భారత్ కు రాహుల్ మొదటి రెండుబాల్స్ లోనే 10 పరుగులు సాధించి అవుటయ్యాడు. రాహుల్ స్థానంలో వచ్చిన కెప్టెన్ కొహ్లీతో కలసి సంజు శాంసన్ విజయం ఖాయం చేశాడు. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

కివీలకు గుండెకోత….

హామిల్టన్, వెలింగ్టన్ టీ-20 మ్యాచ్ ల్లో విజేతగా నిలవాల్సిన న్యూజిలాండ్…మూడురోజుల్లో రెండు సూపర్ ఓవర్ పరాజయాలు పొందడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.

ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిది సూపర్ ఓవర్ మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ కు ఇది ఏడో పరాజయం కావడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

భారత్ 5- న్యూజిలాండ్ 4

ప్రస్తుత సిరీస్ ప్రారంభానికి ముందు వరకూ న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన టీ-20 మ్యాచ్ ల్లో 1-4 రికార్డుతో మాత్రమే ఉన్న భారత్ వరుసగా నాలుగు విజయాలతో…5-4 ఆధిక్యంతో పైచేయి సాధించింది.

కివీ గడ్డపై న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా తొలిసారిగా టీ-20 సిరీస్ నెగ్గిన భారత్ …సిరీస్ లోని ఆఖరి టీ-20 సైతం నెగ్గడం ద్వారా క్లీన్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  1 Feb 2020 2:08 AM IST
Next Story