బడ్జెట్ 2020.... ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు, బ్యాంకు డిపాజిట్ల బీమా పెంపు
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రెండో పర్యాయం నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సారి తీసుకున్న ముఖ్యనిర్ణయాల్లో ఆదాయపు పన్ను శ్లాబుల్లో భారీ మార్పులతో పాటు బ్యాంకు డిపాజిట్లపై ఇన్స్యూరెన్స్ కూడా పెంచారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల […]
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రెండో పర్యాయం నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సారి తీసుకున్న ముఖ్యనిర్ణయాల్లో ఆదాయపు పన్ను శ్లాబుల్లో భారీ మార్పులతో పాటు బ్యాంకు డిపాజిట్లపై ఇన్స్యూరెన్స్ కూడా పెంచారు.
రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల లోపు ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండబోదూ. ఇక 5 లక్షల రూపాయల నుంచి 7.5 లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను, 7.5 లక్షల నుంచి 10లక్షల ఆదాయం గల వారికి 15 శాతం పన్ను, 10 లక్షల నుంచి 12.5 లక్షల రూపాయల ఆదాయం అర్జించే వారికి 20 శాతం పన్ను విధిస్తారు.
ఇక 12.5 లక్షల రూపాయల నుంచి 15 లక్షల ఆదాయం గల వారికి 25 శాతం, 15 లక్షలకు పైగా ఆర్జిస్తే 30 శాతం పన్ను విధించనున్నారు. ఈ పన్ను అనేది ఆప్షనల్ అని.. తాము ఆర్జించే ఆదాయంపై మినహాయింపులు పొందాలా వద్దా అనేది అర్జించే వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకున్న వారికి 80 (సీ) కింద ఇచ్చే మినహాయింపులు రద్దవుతాయి. కాగా, వ్యక్తులు కోరుకుంటే పాత ఆదాయపు పన్ను విధానం అలాగే కొనసాగనుంది.
మరోవైపు బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతం వర్తిస్తున్న బీమాను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇంతకు మునుపు లక్ష రూపాయలు ఉన్న బీమాను ఇకపై 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కాగా, ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీలో వాటాలు విక్రయించడానికి నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. త్వరలోనే ఎల్ఐసీని స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయబోతున్నట్లు సభలో వెల్లడించారు.