పవన్ పై ఈగ వాలనీయని టీడీపీ...
టీడీపీకి తెరవెనుక స్నేహితుడు పవన్ కళ్యాణ్ అని మొన్నటి ఎన్నికల వేళ అధికార వైసీపీ చేసిన విమర్శలను అందరూ లైట్ తీసుకున్నారు. పవన్ సైతం తనకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే ప్రయత్నాలు చేశారు. తాజాగా బీజేపీకి దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. ఆయన పార్టీలోని కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ తీరు నచ్చక బయటకు వెళ్లిపోయారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. […]
టీడీపీకి తెరవెనుక స్నేహితుడు పవన్ కళ్యాణ్ అని మొన్నటి ఎన్నికల వేళ అధికార వైసీపీ చేసిన విమర్శలను అందరూ లైట్ తీసుకున్నారు. పవన్ సైతం తనకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే ప్రయత్నాలు చేశారు. తాజాగా బీజేపీకి దగ్గరయ్యారు.
అయితే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. ఆయన పార్టీలోని కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ తీరు నచ్చక బయటకు వెళ్లిపోయారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. పవన్ లో నిలకడ లేదని.. ఇక రాజకీయాలే అని మళ్లీ సినిమాలు తీస్తున్నారని ఆడిపోసుకున్నారు.
అయితే జేడీ లక్ష్మీనారాయణ చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి. పవన్ రాజకీయం వదిలి సినిమాలు చేయడాన్ని కొందరు విమర్శించారు. కొందరు సమర్థించారు.
తాజాగా టీడీపీ మాత్రం జనసేనాని పవన్ కల్యాణ్ కు బాసటగా నిలవడం విశేషం. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మరో నేత అంబికా కృష్ణలు పవన్ కు సపోర్టు చేశారు. పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసినా.. ఇప్పుడు బీజేపీతో కలిసినా కూడా టీడీపీ శిబిరం సంతోషంగా ఉంది. ఇప్పుడు సీబీఐ జేడీ విమర్శలను తప్పుపడుతూ పవన్ కు టీడీపీ సపోర్టు చేసింది. దీంతో పవన్ కళ్యాన్ ను తెరవెనుక ఉండి నడిపిస్తున్నది టీడీపీయేనన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.