వైసీపీ ఎమ్మెల్యేకి విద్యార్ధి నాయకుల నిరసన
కృష్ణాజిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు జరిగిన నాడు-నేడు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా విద్యార్ధి నాయకులు తమ స్కూల్ లో అదనపు తరగతి గదులు కావాలంటూ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు చూపిస్తూ నిరసన తెలియజేశారు. ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో సుమారు వెయ్యి మంది విద్యార్ధులు చదువుకుంటుంటే మొత్తం 12 క్లాసు […]
కృష్ణాజిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు జరిగిన నాడు-నేడు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా విద్యార్ధి నాయకులు తమ స్కూల్ లో అదనపు తరగతి గదులు కావాలంటూ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు చూపిస్తూ నిరసన తెలియజేశారు.
ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో సుమారు వెయ్యి మంది విద్యార్ధులు చదువుకుంటుంటే మొత్తం 12 క్లాసు రూములే ఉన్నాయని, అవి సరిపోవడం లేదని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో కూడా ఎన్నిసార్లు నిరసనలు తెలియజేసినా ఫలితం లేకుండా పోయిందని… మీరైనా త్వరగా అదనపు తరగతి గదులను నిర్మించండని… ఖాళీగా ఉన్న మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, బయోలజీ, సోషల్ టీచర్ పోస్టులను భర్తీ చేయండి అని విద్యార్ధి నాయకులు కోరారు.
అందుకు స్పందించిన ఎమ్మెల్యే నాడు-నేడు కార్యక్రమం ఉద్దేశమే అది అని… తర్వలోనే అదనపు తరగతి గదులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.