Telugu Global
Cinema & Entertainment

కేవలం సెట్స్ కే 20 కోట్ల రూపాయలు

స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడో బడ్జెట్ హద్దులు దాటిపోయాయి. హీరోల రెమ్యూనరేషన్స్ ఒకెత్తయితే, వాళ్ల కోసం ఒకటికి రెండు అదనంగా సెట్స్ వేయాల్సిన పరిస్థితి రావడంతో నిర్మాతలకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాకు కూడా అదే పరిస్థితి. నిన్ననే క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు పవన్. ఈ మూవీ కోసం దాదాపు 20 కోట్ల రూపాయల ఖరీదైన సెట్స్ వేస్తున్నారు. సినిమాలో రాబిన్ హుడ్ టైపు పాత్ర పోషిస్తున్నాడు పవన్ కల్యాణ్. […]

కేవలం సెట్స్ కే 20 కోట్ల రూపాయలు
X

స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడో బడ్జెట్ హద్దులు దాటిపోయాయి. హీరోల రెమ్యూనరేషన్స్ ఒకెత్తయితే, వాళ్ల కోసం ఒకటికి రెండు అదనంగా సెట్స్ వేయాల్సిన పరిస్థితి రావడంతో నిర్మాతలకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాకు కూడా అదే పరిస్థితి. నిన్ననే క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు పవన్. ఈ మూవీ కోసం దాదాపు 20 కోట్ల రూపాయల ఖరీదైన సెట్స్ వేస్తున్నారు.

సినిమాలో రాబిన్ హుడ్ టైపు పాత్ర పోషిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇంకా చెప్పాలంటే కౌబాయ్ సెటప్స్, పాతకాలం నాటి లుక్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కావాలంటే సెట్స్ వేయాల్సిందే. ప్రస్తుతం అదే పనిలో యూనిట్ ఉంది. 20 కోట్ల రూపాయల ఖర్చుతో హైదరాబాద్ శివార్లలో దాదాపు 5 సెట్స్ నిర్మిస్తున్నారు. వీటిలో ఒక సెట్ నిర్మాణం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. మరో 3 రోజుల్లో అది అందుబాటులోకి కూడా వస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ సెట్ లోనే ఫస్ట్ షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది.

మరోవైపు దర్శకుడు క్రిష్, మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీ అయిపోయాడు. అయితే అందరి దర్శకుల్లా ఇతడు పాటలు, బాణీలు, సాహిత్యం అంటూ కూర్చోలేదు. సినిమాలో సన్నివేశాలు చెప్పి కీరవాణితో 2-3 రకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ కంపోజ్ చేయించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకు పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమట. అందుకే క్రిష్ ఇక్కడ్నుంచి సినిమా పని ప్రారంభించాడు.

First Published:  31 Jan 2020 1:31 AM IST
Next Story