Telugu Global
NEWS

పాల‌నపై దృష్టి పెట్టిన జ‌గ‌న్.... ప‌థ‌కాల అమ‌లుపై ఫోక‌స్ !

ఏపీలో వెల్ ఫేర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సీఎం జగన్… ఫిబ్రవరి 1 నుంచి పథకాలను ప్రతి పేదోడి తలుపు తట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసి… సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. నవరత్నాల అమలు వంటి వాటిపై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్… ఫిబ్రవరి 1 నుంచి పెన్షన్ల పంపిణీ…..ఫిబ్రవరి 15 నుంచి కొత్త పించన్లు, బియ్యం కార్డుల పంపిణీ, ఉగాది నాటికి 25లక్షల […]

పాల‌నపై దృష్టి పెట్టిన జ‌గ‌న్.... ప‌థ‌కాల అమ‌లుపై ఫోక‌స్ !
X

ఏపీలో వెల్ ఫేర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సీఎం జగన్… ఫిబ్రవరి 1 నుంచి పథకాలను ప్రతి పేదోడి తలుపు తట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసి… సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నవరత్నాల అమలు వంటి వాటిపై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్… ఫిబ్రవరి 1 నుంచి పెన్షన్ల పంపిణీ…..ఫిబ్రవరి 15 నుంచి కొత్త పించన్లు, బియ్యం కార్డుల పంపిణీ, ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు, విద్యా దీవెన, రైతు భరోసా కేంద్రాలు.. ఇలా ఈ ఏడాదిలో సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టించేదుకు సిద్ధమౌతోంది ఏపీ సర్కార్.

ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పథకాలను వన్ బై వన్ రివ్యూ చేస్తూ… అందులో ఉన్న లోటు పాట్లపై చర్చించి అధికారులకు తగు సూచనలు చేశారు ఏపీ సీఎం. ఈ ఏడాది ముందుగా ప్రవేశ పెట్టే పథకం…డోర్‌ డెలివరీ పెన్షన్ స్కీమ్…రాష్ట్రవ్యాప్తంగా 54లక్షలా 64వేల మందికి పైగా పేదలకు మేలు చేకూరుస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

అర్హులైన పేదలందరికీ ఉగాదికి ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఎవరైనా ఇళ్ల స్థలం లేదనే పరిస్థితి లేకుండా చూడాలని…. మహిళల పేర్లతో 10 రూపాయల స్టాంపు పేపర్‌పై ఇళ్లపట్టాలు జారీ చేయాలని సూచించారు. ఇందుకు మార్చి చివరికల్లా ఇళ్ల స్థలాల తంతు పూర్తికావాలని డెడ్‌లైన్‌ కూడా విధించారు ఏపీ సీఎం.

రాష్ట్రంలో విద్యార్ధుల కోసం వసతి దీవెన పథకం ఫిబ్రవరి 20న ప్రారంభంకానుంది. విద్యార్ధులకు బోర్డింగ్ -లాడ్జింగ్ ఖర్చులకుగాను ఐటీఐ విద్యార్ధులకు 10వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15వేలు, డిగ్రీ ఇతర కోర్సులు చేస్తున్నవారికి ఏడాదికి 20వేల చొప్పున అందించనున్నారు.

రైతులకోసం ఏపీ సర్కార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి 11వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం విధించుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తుండగా ఇందులో 336 సేవలను కేవలం 72 గంటల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.

ఫిబ్రవరి 15 నుంచి కంటివెలుగు మూడో విడత ప్రారంభం కానుంది. అమ్మఒడి కింద 42లక్షలా 33వేల 98మందిని గుర్తించినట్లు సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 41లక్షలా 25వేల 808 మంది లబ్దిదారులకు 6వేల 188కోట్లు పంపిణీ చేసినున్నట్లు గుర్తు చేశారు.

ఇలా ప్రతి పథకాన్ని తానే పర్యవేక్షిస్తూ… అది అమలయ్యే వరకు అధికారుల వెంటపడుతూ… జగన్ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది.

First Published:  30 Jan 2020 4:44 AM IST
Next Story